ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్ప మేనియా నడుస్తోంది. సౌత్ టు నార్త్ ఎవరి నోట విన్నా పుష్ప డైలాగులు, పుష్ప్ స్టెప్పులే కనిపిస్తున్నాయి.. వినిపిస్తున్నాయి. ఈ మాస్ సినిమా అంతలా జనాల్లోకి దూసుకుపోయింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కి ఐదు భాషల్లో రిలీజ్ అయ్యింది. అసలు ఈ సినిమాను హిందీలో ఏ మాత్రం ప్రమోషన్లు చేయకపోయినా ఏకంగా రు. 85 కోట్ల వసూళ్లు రాబట్టి పెద్ద సంచలనం అయ్యింది. ఏపీలో టిక్కెట్ల రేట్ల ఇష్యూ లేకపోతే పుష్ప తెలుగులో కూడా ఇంకా వసూళ్లు రాబట్టేదే. అటు కేరళలోనూ పుష్పకు భారీ లాభాలు వచ్చాయి.
ఇప్పటికే ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అయినా కూడా ఇంకా థియేటర్లలో రన్ అవుతోంది. ఇక వసూళ్ల పరంగా ఇప్పటికే పుష్ప రు. 250 కోట్ల పై చిలుకు వసూళ్లు కొల్లగొట్టేసింది. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ గతంలో ఎప్పుడూ లేనంతగా ఊరమాస్ క్యారెక్టర్‌లో కనిపించాడు. పుష్ప రాజ్ గా బన్నీ అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ కోసం సుకుమార్ ముందుగా వేరే వాళ్లను అనుకున్నాడట.
హీరో పాత్ర నుంచి విలన్ వరకు వేరే వాళ్లను అనుకున్నాక వారు సెట్ కాకుండా ఇప్పుడు వీళ్లు సెట్ అయ్యారు. మహేష్‌తో వన్ సినిమా ప్లాప్ అవ్వడంతో సుకుమార్ ఈ కథను మహేష్‌తో చేయాలని అనుకున్నాడు. అయితే మహేష్ ఈ కథను రిజెక్ట్ చేయడంతో బన్నీకి ఆ ఛాన్స్ వచ్చింది. ఇక రష్మిక చేసిన హీరోయిన్ పాత్ర కోసం ముందుగా సమంతను అనుకున్నారు. కొన్ని కారణాల వల్ల సమంత నో చెప్పడంతో చివరకు శ్రీవల్లి పాత్ర కోసం రష్మిక ఎంట్రీ ఇచ్చింది.
ఇక ఊ అంటావా ఐటెం సాంగ్ కోసం ముందుగా బాలీవుడ్ బ్యూటీ దిశా పాటని – నోరా ఫతేహిను సంప్రదించారట. నోరా భారీగా డిమాండ్ చేయడంతో తర్వాత దిశాను అడిగారట. ఆమె కూడా నో చెప్పడంతో తర్వాత సమంత వచ్చింది. ఇక విలన్ పాత్ర కోసం ముందుగా కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతిని తీసుకోవాలనుకున్నారు. డేట్లు సర్దుబాటు కాకపోవడంతో చివరకు షికావత్ పాత్రను విజయ్ వదులుకున్నాడు.
బెంగాలీ నటుడు జిష్ణు సేన్ గుప్తా, అలాగే టాలీవుడ్ హీరో నారా రోహిత్ లను కూడా అడిగారట. వాళ్లు కూడా నో చెప్పడంతో చివరకు ఆ ఛాన్స్ మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్‌కు ఆ ఛాన్స్ దక్కిందట. ఇలా వీళ్లంతా కూడా పుష్ప సినిమాను వదులుకుని ఓ బ్లాక్ బస్టర్ మిస్ అయ్యారు.