టాలీవుడ్లో కొందరు హీరోయిన్లు తండ్రితోనూ, కొడుకుతోనూ ఆడిపాడారు. ఇది ఇప్పటి నుంచే కాదు… అప్పట్లో అతిలోక సుందరి శ్రీదేవి నుంచే కొనసాగుతోంది. ఇక కొందరు హీరోయిన్లు ఒకే కుటుంబంలో బాబాయ్, అబ్బాయ్‌తో కలిసి నటించారు. ఇలా ఎవరెవరు ఒకే కుటుంబంలో వారితో రొమాన్స్ చేశారో చూద్దాం.
శ్రీదేవి :
అతిలోక సుందరి శ్రీదేవి ఏఎన్నార్‌తోనూ ఆయన తనయుడు నాగార్జునతోనూ రొమాన్స్ చేశారు. ఏఎన్నార్‌తో ఎన్నో సినిమాలు చేసిన శ్రీదేవి నాగార్జునతో గోవిందా గోవిందా, ఆఖరిపోరాటం సినిమాల్లో నటించారు. అప్పట్లో శ్రీదేవి తండ్రి, కొడుకులతో నటించడం సంచలనం.
కాజల్ అగర్వాల్ :
కాజల్ మగధీర సినిమా లో రాంచరణ్ కు హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత చిరు రీ ఎంట్రీ సినిమా ఖైదీ నెంబర్ 150లో చిరు పక్కనే నటించింది. అసలు కాజల్ తండ్రి, కొడుకుల పక్కన చేసినా ఏ మాత్రం ఎబ్బెట్టుగా లేదు. పైగా ఇదే ఫ్యామిలీలోని బన్నీ పక్కన కూడా కాజగ్ ఆర్య 2 సినిమా చేసింది.
రకుల్‌ప్రీత్‌సింగ్:
రకుల్‌ప్రీత్ నాగచైతన్య రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో హీరోయిన్. ఆ తర్వాత నాగార్జున మన్మధుడు 2 సినిమాలో తనకన్నా ఏజ్ గ్యాప్ ఉన్న నాగార్జునతో రొమాన్స్ చేయడంతో పాటు ఏకంగా ఘాటుగా లిప్కిస్ల్లో కూడా నటించింది.
శ్రీయ:
బాలయ్యతో చెన్నకేశవరెడ్డి సినిమా చేసిన శ్రీయ ఎన్టీఆర్ పక్కన నా అల్లుడు సినిమా చేసింది. తర్వాత మళ్లీ బాలయ్యతో గౌతమీపుత్ర శాతకర్ణి, పైసా వసూల్ సినిమా చేసింది.
తమన్నా :
మిల్కీబ్యూటీ తమన్నా రామ్‌చరణ్‌తో రచ్చ, పవన్ కళ్యాణ్‌తో కెమేరామెన్ గంగతో రాంబాబు, చిరుతో సైరా, బన్నీతో బద్రీనాథ్ సినిమాల్లో నటించింది.
జెనీలియా:
జెనీలియా వెంకటేష్ పక్కన సుభాష్ చంద్రబోస్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. రానా పక్కన నా ఇష్టం సినిమా లో హీరోయిన్ గా నటించింది.
అనుష్క శెట్టి:
అనుష్క వెంకటేష్ పక్కన చింతకాయల రవి సినిమా లో హీరోయిన్. రానాకు జోడీగా రుద్రమదేవి సినిమాలో హీరోయిన్ గా నటించింది.