ఎన్టీఆర్ సినిమా తెరమీద మాత్రమే హీరో కాదు.. ఆయన నిజ జీవితంలో కూడా హీరోనే..! అందుకే తెలుగోడి ఆత్మగౌరవం ఢిల్లీ వీథుల్లో నలిగిపోతుంటే.. ధైర్యంగా దానిని వెలుగెత్తి చాటడంతో పాటు పార్టీ పెట్టి 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన తెరమీద మాత్రమే ధైర్యంగా హీరో పాత్రలు చేయడం కాదు.. నిజ జీవితంలో కూడా చాలా ధైర్యంగా ఉండేవారు. అలాగే ఆయనలో సేవా గుణం కూడా ఉంది. రాజకీయ జీవితంలోకి రాకముందు కూడా ఎవ్వరు అయినా కష్టాల్లో ఉంటే ఆయన వెంటనే స్పందించి ఆదుకునేవారు.
తనతో సినిమాలు చేసిన నిర్మాతలు నష్టపోతే వారికి రెమ్యునరేషన్ కొంత వెనక్కు ఇవ్వడమో లేదా వారికి మరో సినిమా చేసి పెట్టడమో చేసేవారు. ఇక ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. ఈ లిస్టులోనే దేవత సినిమా కూడా ఉంది. 1965లో రిలీజ్ అయిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఈ సినిమాలోనే ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి అన్న సాంగ్ ప్రేక్షకుల్లో ఇప్పటకీ నానుతూనే ఉంటుంది.
అప్పటి ప్రముఖ కమెడియన్ పద్మనాభం ఈ సినిమాను నిర్మించగా హేమాంభరధరరావు దర్శకత్వం వహించారు. మహానటి సావిత్రి ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా నటించారు. ఈ సినిమాలో ఓ పాటను షూట్ చేస్తుండగా.. ముందుగా సావిత్రి లొకేషన్‌కు వెళ్లిపోయారు. ఆ తర్వాత పద్మనాభం, ఎన్టీఆర్ కారులో డ్రైవర్‌తో కలిసి లొకేషన్‌కు బయలు దేరారు.
తిరువణ్ణామలై ప్రాంతానికి వచ్చాక తనను నిద్ర లేపాలని ఎన్టీఆర్ కారులోనే నిద్రకు ఉపక్రమించారు. ఎన్టీఆర్ పడుకున్నాక చెంగల్పట్టు దగ్గర ఎన్టీఆర్ వెళుతున్న కారుకు ముందుగా పెద్దపులి వచ్చిందట. వెంటనే డ్రైవర్ గజగజ వణికిపోయారట. పద్మనాభం కూడా భయపెడ్డారట. అయితే ఆ తర్వాత వారు వెళ్లాల్సిన ప్రాంతం వచ్చాక ఎన్టీఆర్‌ను నిద్రలేపి పులి విషయం చెప్పారట.
వెంటనే ఎన్టీఆర్ పెద్దపులి ఎదురు రావడం మంచిదని.. తనను కూడా నిద్రలేపి ఉంటే చూసేవాడిని అని పద్మనాభంతో చెప్పారట. ఇక సినిమా సెట్స్‌లో ఒక్కోసారి ఎన్టీఆర్ ధైర్యంగా భారీ రిస్క్‌లు కూడా చేసేవాడని అంటుంటారు.