బాలీవుడ్ ముదురు ముద్దుగుమ్మలు 50 ఏళ్ల వయస్సుకు చేరువ అయినా అసలు వృద్ధాప్యాన్ని ఏ మాత్రం మీద పడకుండా అందం మెయింటైన్ చేస్తోన్న తీరుకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అసలు ఓల్డ్ ఏజ్‌కు చేరువ అవుతున్నా కూడా వాళ్లు ఇంకా ఆంటీలుగానే కనిపిస్తున్నారు. ఐశ్వర్యారాయ్ – మలైకా అరోరా – టబు – రవీనా టాండన్ – మాధురీ దీక్షిత్ తో పాటు ఎందరో సీనియర్ నటీమణులు వయసుతో పాటు అందంలోనూ రాటుదేలుతున్నారు. వీరికి వయసు పెరుగుతుంటే అందం కూడా పెరుగుతోంది. అయితే వారి వంపుసొంపులు చూస్తుంటే వారు ఇంకా 30 – 35 ఏళ్ల మధ్యలో ఉన్న ఆంటీలుగా ఉన్నట్టే ఉన్నారు.
మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్‌ను చూస్తుంటే ఆమె ఇప్పటకీ ప్రపంచ సుందరిగానే ఉన్నట్టు కనిపిస్తోంది. ఆమె వయస్సు ఇప్పటికే 48.. మరో రెండేళ్లలో 50 క్రాస్ అవుతుంది.. ఆమెను చూస్తుంటే ఇప్పటకీ కుర్ర హీరోయిన్లకు పోటీ వచ్చేలా ఉంది. అసలు ఐష్‌లో వృద్ధాఫ్యం చాయలు ఏ మాత్రం కనపడడం లేదు. మలైకా అరోరా వయస్సు 47. ఇప్పటకీ శరీరాన్ని మెరుపు తీగలా ఒంపులు తిప్పేస్తూ ఉంటుంది. ఈ వయస్సులో కూడా ఆమె బీచ్‌ల్లో బికీనీలు వేస్తూ మాంచి ట్రీట్ ఇస్తూ ఉంటుంది. అమ్మమ్మ వయస్సులోనూ మలైకా ఆంటీలే కుళ్లుకునేలా చేస్తూ ఉంటుంది.
ఇక రవీనా టాండన్ మరోసారి టూ ఎనర్జిటిక్ అన్నది ఫ్రూవ్ అయ్యింది. ఇటీవల రిలీజ్ అరణ్యక్ సినిమాతో ఆమె ప్రేక్షకుల నుంచి విపరీతమైన ప్రేమ అందుకుంది. ఆమె వయస్సు 47. ప్రతి యేటా ఆమె వయస్సు పెరుగుతున్నా తగ్గాల్సిన అందం పెరుగుతోంది. మస్త్ మస్త్ గర్ల్‌గా పాపులర్ అయిన రవీనా ఇప్పటకీ అదే బ్రాండ్‌ను కంటిన్యూ చేస్తోంది. 51 ఏళ్ల టబు బహుభాషా నటి. ఆమె వయస్సు 52 ఏళ్లు. అమ్మమ్మ వయస్సులోకి వచ్చినా కూడా ఇప్పటకి పెళ్లన్న మాట లేకుండా అలాగే ఉండిపోయింది. నిరంతరం జిమ్‌లో వ్యాయామాలు, యోగా చేస్తూ తన ఫిట్నెస్ను అలాగే కాపాడుకుంటోంది.
మాధురీ దీక్షిత్ వయసు 54 ఏళ్లు. ఆమె ఇద్దర పిల్లల తల్లి అంటే ఎవ్వరూ నమ్మరు. ఈ వయస్సులో కూడా సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసే ఫొటోలు చూస్తుంటే ఇరవై ఏళ్ల క్రితం ఆమె ఎలాంటి అందంతో ఉందో ఇప్పుడూ ఆమె అందం చెక్కు చెదర్లేదని తెలుస్తోంది. వీళ్లతో పాటు సౌత్ ఇండియా వెటరన్ హీరోయిన్లు నదియా- ఇంద్రజ- రాశీ లాంటి నటీమణులు 40 ప్లస్ ఏజ్‌లో కూడా రోజు రోజుకు మరింత అందంగా తయారవుతున్నారు.