గతంలో ఎన్నడు లేని విధంగా ఈసారీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు హాట్ హాట్ గా జరిగాయి అన్న సంగతి తెలిసిందే. పోలిటికల్ ఎన్నికలను తలపించే స్దాయిలో మాటలు తూటాలు లా పేలాయి ప్రకాష్ రాజ్-మంచు విష్ణు ప్యానల్ సభ్యుల మధ్య. మొదతీ నుండి నానా రచ్చ చేసిన సభ్యులు పోలింగ్ టైంలో అయితే మరింత రెచ్చిపోయి గొడవలకు సైతం దిగ్గారు. పోలింగ్ కేంద్రం వద్ద రాజకీయ ఎన్నికల ను తలపించేలా వాతావరణం కనిపించింది. సభ్యులు ఒకరిపై మరొకరు దూషణలు చేసుకోవడమే… కాకుండా దాడులకు దిగడం కూడా అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.
అయితే గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి సభ్యులు దాడులుకి దిగ్గడం కొంచెం బాధ కలిగించింది సినీ ప్రముఖులకి. ఇక పోలింగ్ కేంద్రం వద్ద నటుడు శివబాలజీకి..నటి హేమకి జరిగిన రచ్చ గుర్తుంది కదా. హా మర్చిపోయే లా కొరికింద హేమ..దెబ్బకు శివ బాలజీ మీడియా ముందుకు వచ్చి మరీ ఫైర్ అయ్యారు. అయితే ఇదే విషయం పై క్లారిటీ ఇస్తూ..నటి హేమ సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఏం చేయకుండా ఊరికే ఎందుకు కొరుకుతాను చెప్పండి. అసలు లోపల చాలా గొడవ జరిగింది. కానీ ఆ మ్యాటర్ బయటకు రానివ్వకుండా నేను కొరికాను అనే హాట్ ఇష్యూ క్రియేట్ చేశారు. అయినా నేను అంతలా కొరకలేదు జస్ట్ పంటితో అలా టచ్ చేశా అంటే. పది మంది ఒక అబ్బాయిని కొట్టబోతుంటే నేను చూస్తూ తట్టుకోలేకపోయాను.. అడ్డుకోడానికి వెళ్లాను..ఈ క్రమంలోనే శివబాలాజీ తనను ముందుకు వెళ్లకుండా అడ్డుపడ్డాడు..నేను వెళ్ళాలి అని అరుస్తున్న శివబాలాజీ చేతి తీయకపోవడంతో చేయిని కొరికాను అని క్లారిటీ ఇచ్చింది హేమ. ఇక ఎన్నికల తరువాత మా పీఠం దక్కించుకున్న విష్ణు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడొ మనకు తెలిసిందే..!!