సినిమా ఇండస్ట్రీ అంటేనే అదో తెలియని మాయలోకం. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు ఊహించలేరు. నేదు స్టార్స్ గా ఉన్న హీరోలు రేపు జీరో అయిపోతారు. అలా చాలా మందే అయ్యారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ లకు మాత్రమే కాదు హీరోలకు కూడా అదృష్టం కలిసి వస్తే నే స్టార్లుగా ఎదుగుతారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఉన్నా సరే అదృష్టం లేనిదే ఎంత టాలెంట్ ఉన్నా పనికిరాదు. ఆ విధంగా సినిమా కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన హీరోలు కూడా తమ సత్తా చాటి స్టార్ లు గా ఎదగలేకపోయారు. మంచి మంచి సినిమాలతో కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఎవ్వరికి కనిపించకుండా పోయిన నటులు ఎందరో ఉన్న్నారు. అలాంటి వారీలో హీరో వెంకట్ కూడా ఒకరు.
అక్కినేని కుటుంబం నుంచి చాలామంది హీరోలు టాలీవుడ్ కి పరిచయం అవగా వారిలో ఒక హీరో వెంకట్. తెలుగులో దాదాపు 15 చిత్రాలకు పైగా నటించి హీరో గా, నటుడిగామంచి గుర్తింపు దక్కించుకున్నాడు. డైరెక్టర్ వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి’ సినిమా ద్వారా పరిచయమైన తెలుగు హీరో వెంకట్. ఇప్పటి వరకూ తన కెరీర్లో కొన్ని మంచి సినిమాలు చేసిన వెంకట్ మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ లాంటి హీరోలతో సహా సినిమాలు చేసాడు.
హీరోగా మంచి హైట్ పర్సనాలిటీ ఉన్న వెంకట్ తర్వాత సైడ్ క్యారెక్టర్స్ కి మాత్రమే పరిమితం అయ్యాడు. తొలి సినిమాతో ఎంత మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ వెంకట్ కి మాత్రం సినీ పరిశ్రమలో పెద్దగా పేరు రాలేదు. ఆ సమయంలో మరికొంత మంది హీరోలు వెలుగు లోకి వచ్చారు. ఓ ఇంటర్వ్యుల్లో ఆయన మాట్లాడుతూ..”చిరంజీవితో కలిసి అన్నయ్య సినిమాలో నటించిన తర్వాత తాను మరిన్ని సినిమాలు చేస్తానని చాలా మంది ఎదురు చూశారని.
దానికి ప్రత్యేకమైన కారణమంటూ ఏం లేదని, ఆ సినిమా తర్వాత కొన్ని మూవీస్ చేసినా కూడా అవి అంతగా ఆడలేదని. ఫ్లాఫ్ సినిమాల ప్రభావం తరువాత వచ్చే సినిమాలపై కచ్చితంగా ఉంటుందని. ఒక పాత్రలో నటించడానికి అవకాశం వచ్చింది.. ఇక ఆ పాత్ర వల్లే ఇండస్ట్రీకి ఇన్ని రోజులు దూరమయ్యాను” అంటూ ఆయన తెలిపారు. ఇక పారితోషికం మరీ తక్కువగా ఇస్తామని చెప్పడం వలన కూడా కొన్ని అవకాశాలను వదులుకోవలసి వచ్చింది అని చెప్పుకొచ్చాడు. వెండితెరపై వెలిగిపోవాలని ఎన్ని కలలతో వచ్చినప్పటికీ అదృష్ట కూడా సహకరించాలని అంటుంటారు.