దిల్ రాజు ..ప్రస్తుతం టాలీవుడ్ ని శాసిస్తున్న నిర్మాత. డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి 2003లో దిల్ సినిమాతో నిర్మాతగా మారి.. ఈ రోజు ఇండస్ట్రీని శాసించే వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరుగా ఉన్నారు అంటే దాని వెనుక ఆయన కష్టం..ఆయన కి ఉన్న టాలెంట్ ఏంటో మనం అర్ధం చేసుకోవచ్చు. డిస్ట్రిబ్యూషన్, నిర్మాతగా, ఎగ్జిబిటర్, థియేటర్ల సిండికేట్‌లో ఒక కీలక వ్యక్తిగా ఆయన చక్రం తిప్పుతారన్న టాక్ అయితే ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. రాజు ప్లానింగ్ మామూలుగా ఉండదు. కొన్ని సంవత్సరాలుగా ఆయన హవా నడుస్తోంది. పెద్ద హీరోలు, దర్శకులతో క్రేజీ కాంబినేషన్లు సెట్ చేయడం ఆయనకే చెల్లింది.
ఇండస్ట్రీలో ఆయనకు ఓ పేరుంది. ఆయన కన్ను పడిందంటే ఆ సినిమా హిట్టే. ఆయన సెట్ చేసి చూస్ చేసుకునే కాంబినేషన్స్ అలానే ఉంటాయి. ఇప్పటి వరకు రాజుగారి ప్లానింగ్ మిస్ అయ్యిందే లేదు. అనుకున్నంత బడ్జెట్ లో సినిమాను తెరకెక్కించడం దిల్ రాజు స్పెషాలిటి. కానీ ఫస్ట్ టైం రాజుగారి కి బడ్జెట్ విషయంలో చుక్కలు చూయిస్తున్నాడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్.
బడా దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఓ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు శంకర్ తెలుగులో నేరుగా తీయనున్న తొలి చిత్రం ఇదే కావడం మరో విశేషం. ఇక మరో వైపు పాన్ ఇండియా మూవీ తరవాత రామ్ చరణ్ చేయబోతున్న ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కీయార అద్వానీ నటించడం సినిమా కి మరో ప్లస్ పాయింట్.
దీంతో ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్స్ మెగా అభిమానుల్లో నూతనోత్సాహం నింపుతున్నాయి. ఇప్పటికే కొంత మేరకు చిత్రీకరణను కూడా సినిమా పూర్తి చేసుకుంది. కాగా , తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఓ పాటను చిత్రీకరించడానికి ఏకంగా 25 కోట్లు ఖర్చు చేస్తున్నారట శంకర్. తనదైన స్టైల్లో హై టెక్నికల్ వేల్యూస్‌తో రూపొందించడానికి శంకర్ ప్లాన్ చేశారట.
శంకర్ సినిమా అంటే మేకింగ్ ఓ రేంజ్‌లో ఉంటుందన్న సంగతి తెలిసిందే. దానికి తగ్గట్లే ఖర్చు కూడా భారీగానే పెట్టిస్తారు. అయితే కేవలం ఒక్క పాటకు పాతిక కోట్లు ఖర్చు పెట్టడమేంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. హాలీవుడ్ టెక్నిషియన్స్ ఈ పాటకు వర్క్ చేయబోతున్నారని అందుకే ఆ రేంజ్‌లో ఖర్చు అవుతుందని సమాచారం.
ఇక ఈ లెక్కన చూసుకుంటే సినిమా కంప్లీట్ అయ్యే సరికి శంకర్ ..బడ్జెట్ విషయంలో దిల్ రాజు దూల తీర్చేయడం పక్కా అంటునారు నెటిజన్స్. ఇక ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలోనూ దిల్ రాజు ఓ డిసిషన్ తీసేసుకున్నారట. వచ్చే ఏడాది అంటే 2023 సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నామని తెలిపారు దిల్ రాజు.