సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సర్వ సాధారణం అయిపోయింది. మమల్ని పలనా డైరెక్టర్ పక్కలోకి రమ్మనాడు రా బాబోయ్ అని కొదరు హీరోయిన్ లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్లు నెత్తి నోరు మొత్తుకున్న ఎవ్వరు పట్టించుకోవడం లేదు. ఇక కొందరు ఏం చేయలేక తమకున్న కల నెరవేర్చుకోవడానికి అడ్జెస్ట్ అవుతుంటే మరికొందరు ఇలాంటి నీచమైన పనులు చేయలేక తమ కలను చంపేసుకుంటున్నారు.
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా సెటిల్ అవ్వాలని చాలా మంది అనుకుని వచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయిన వారు ఉన్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది నటులు నటించాలనే ఉద్దేశంతో ఎలాంటి పాత్రనైనా ఓకే చెబుతూ ఉంటారు. అయితే కొందరు నటీనటులు చిన్న పాత్ర వచ్చినప్పటికీ మంచి గుర్తింపును సొంతం చేసుకుంటారు. అలా ఎంతో పాపులారిటీ సంపాదించిన నటీమణులలో జయవాణి కూడా ఒకరు. చేసింది కొన్ని సినిమాలే అయిన చేసిన ప్రతి సినిమాల్లో తన క్యారెక్టర్ కు మంచి మార్కులే వేయించుకుంది.
తాజాగా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన ఈమే తనకు ఇండస్ట్రీలో జరిగిన కొన్ని అవమానాలతో పాటు.. బాధపడిన సంధర్భాల గురించి చెప్పుకొచ్చింది. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో జయవాణి చాలా అవమానాలు ఎదుర్కొన్నారట. సినీ పరిశ్రమలో ఎన్నో సినిమాల్లో నటించిన ఆమె ఎక్కువగా విలన్ క్యారెక్టర్ లతో ప్రేక్షకులను మెప్పించారు. జయవాణి ఫేస్ గుర్తుకు రాగానే ప్రతి ఒక్కరూ ఆమె చేసిన విలన్ పాత్రలను గుర్తుకు తెచ్చుకుంటారు. తెలుగులో మహిళా విలన్ పాత్రలు చేసే వారి సంఖ్య చాలా తక్కువ. అయితే ఆ పాత్రలో ఛాలెంజింగ్ గా నటించి మెప్పించిన తక్కువ మందిలో జయవాణి కూడా ఒకరు.
సినీ ఇండస్ట్రీలో మొదట్లో తను నల్లగా ఉన్నానని అవకాశాలు ఇవ్వలేదని తెలిపింది. ఇలా ముగ్గురు డైరెక్టర్లు కామెంట్లు చేయడంతో.. ఆమె ఏం చేయాలో తెలియక గా మేకప్ నేర్చుకొని ఆ సమస్యను తొలగించుకొని ఇప్పుడు స్టార్ హీరో సినిమాలలో కూడా ఆఫర్లు వస్తున్నాయని చెప్పుకొచ్చింది. ఇక తన కెరీర్ మొదట్లో ఓ తెలుగు డైరెక్టర్ హీరోయిన్ గా అవకాశం ఇస్తానని చెప్పి..ఫోటో షూట్ కు రమ్మానారని.. ఆమెను కొన్ని యాంగిల్స్ లో ఫోటోలు కూడా తీసారని ..కానీ ఆ ఫోటోలు కోసమని తీసిన ఆ సినిమా ఏమైందో మాత్రం తెలియలేదని..నా పర్మీషన్ లేకుండామే ఆ ఫోటోలు మాత్రం పలు వెబ్సైట్లలో లీకయ్యాయని చెప్పుకొచ్చింది జయవాణి.