Moviesప్రియుడు కౌగిలిలో న‌లుగుతోన్న స్టార్ హీరో కుమార్తె...!

ప్రియుడు కౌగిలిలో న‌లుగుతోన్న స్టార్ హీరో కుమార్తె…!

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ ప్రేమ వ్య‌వ‌హారం గ‌త కొద్ది రోజులుగా నేష‌న‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇరా ఖాన్ పిట్‌నెస్ ట్రైన‌ర్ నుపుర్ శిఖ‌రేతో ప్రేమ‌లో మునిగి తేలుతోన్న సంగ‌తి తెలిసిందే. గ‌తేడాది వాలైంటైన్స్ వీక్‌లోనే ఈ జంట ప్రేమ‌లో ఉన్న‌ట్టు స్వ‌యంగా చెప్పారు. ముందు స్నేహితులుగా ఉన్న వీరు ఆ త‌ర్వాత మ‌రింత ద‌గ్గ‌ర‌వ్వ‌డంతో పాటు ప్రేమ‌లో ప‌డ్డారు. ఇక ప్రామీస్ డే సంద‌ర్భంగా నుపుర్‌తో క‌లిసి స‌న్నిహితంగా ఉన్న ఫొటోల‌ను ఇరా ఖాన్ షేర్ చేయ‌డంతో పాటు త‌మ మ‌ధ్య ఎంత సాన్నిహిత్యం ఉందో రివీల్ చేసింది.

అప్ప‌టి నుంచి ఇరా సోష‌ల్ మీడియా అక్కౌంట్స్‌లో త‌మ ఫొటోలు షేర్ చేస్తోంది. ఈ ఫొటోల‌కు ఆమె సోష‌ల్ మీడియా ఫాలోవ‌ర్స్ కూడా భారీ ఎత్తున లైకులు, కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఇరా త‌న ప్రియుడి కౌగిలిలో సేద‌తీరుతోన్న ఫొటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో ఇరా రెడ్ & వైట్ బ్లౌజుతో ధ‌గ‌ధ‌గ‌ళాడుతోంది. ఇక ఐరాను ప్రియుడు నుపుర్ వెన‌క‌నుంచి కౌగిలించుకుని ఉన్నాడు. ఐరా ప్రియుడి కౌగిళ్ల‌లో బందీ అయిపోయింది.

ఈ ఫోటోలో ఇరాఖాన్ తల్లి రీనా దత్తా కూడా ఉన్నారు. ఈ జంట చూడ‌ముచ్చ‌ట‌గా ఉంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇరా అమీర్ ఖాన్ మొద‌టి భార్య రీనా ద‌త్ కుమార్తె. ఆమెతో విడాకుల త‌ర్వాత ల‌గాన్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా పనిచేసిన కిర‌ణ్‌రావును ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇక ఇటీవ‌ల ఆమెకు కూడా అమీర్ విడాకులు ఇచ్చేశాడు.

ఇక ఇరా ఖాన్ విష‌యానికి వ‌స్తే ఆమె నుపుర్ కంటే ముందు మిషాల్ అనే వ్య‌క్తిని ప్రేమించి.. అత‌డితో డేటింగ్ చేసింది. కొద్ది రోజుల త‌ర్వాత వీరి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో వీరు విడిపోయారు. ఆ త‌ర్వాత ఫిట్‌నెస్ ట్రైన‌ర్ అయిన నుపుర్ శిఖ‌రేతో ప్రేమ‌లో ప‌డింది. ఇక ఇరా ఇప్పుడు త‌ల్లి వ‌ద్దే ఉంటోంది. ఇక సోష‌ల్ మీడియాలో ఇరాకు మంచి ఫాలోయింగ్ ఉంది. త‌న అభిమానుల‌ను శాటిస్‌పై చేసేందుకే ఆమె ఎప్ప‌టిక‌ప్పుడు త‌న రొమాంటిక్ ఫొటోల‌ను షేర్ చేస్తూ ఉంటుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news