టాలీవుడ్‌లో సీనియర్ డైరెక్టర్ వి. సముద్రది 30 ఏళ్ల ప్రస్థానం. ఆయన ఎందరో స్టార్ దర్శకుల దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఆయన డైరెక్టర్ అయ్యి ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించారు. 2000వ దశకంలో ఆయన ఓ సూపర్ హిట్ డైరెక్టర్. సింహరాశి – సూర్యం – మహానంది లాంటి హిట్ సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. సముద్ర సినిమాల్లో ఫ్యామిలీ కథాంశంతో పాటు ఎమోషనల్ కథాంశం, యాక్షన్ సీన్లు బాగా ఉండేవి. అప్పట్లోనే ఆయన సినిమాలు అటు ఫ్యామిలీ అభిమానులతో పాటు యాక్షన్ ప్రియులను బాగా అలరించేవి.
రాజశేఖర్ వరుస ప్లాపుల్లో ఉన్నప్పుడు ఆయనతో సింహరాశి సినిమా చేస్తే అది 100 రోజులు ఆడింది. యావరేజ్ మార్కెట్ ఉన్న రాజశేఖర్‌తో సముద్ర చేసిన ఆ బ్లాక్‌బస్టర్ హిట్ రాజశేఖర్ కెరీర్‌ను బాగా టర్న్ చేసింది. ఆ తర్వాత హరికృష్ణ, జగపతిబాబు కాంబోలో చేసిన శివరామరాజు కూడా హిట్ అయ్యింది. ఇక ఇటీవల సినిమాలకు కాస్త దూరంగా ఉన్న ఆయన తన తాజా ఇంటర్వ్యూలో జీవిత, రాజశేఖర్‌ల వల్ల తాను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నానో వెల్లడించారు.
రాజశేఖర్ హీరోగా ఎవడైతే నాకేంటి సినిమాకు సముద్ర దర్శకత్వం వహించారు. ఈ సినిమా షూటింగ్ 70 శాతం పూర్తయ్యింది. అయితే సినిమా హిట్ అవుతుందన్న ధీమా రావడంతో జీవిత, రాజశేఖర్ సముద్రను పలు రకాలుగా ఇబ్బందులు పెట్టి ఆయన తనంతట తానే ఆ సినిమా నుంచి తప్పుకునేలా చేశారట. సెట్స్‌లోనే సముద్రను ఇరిటేట్ చేయడంతో పాటు తక్కువ చేసి మాట్లాడుతూ చాలా ఇబ్బంది పెట్టారట. ఆ తర్వాత సముద్ర ఈ సినిమా నుంచి తప్పుకున్నారట.
అయితే ఆ తర్వాత జీవిత, రాజశేఖర్ వచ్చి మరోసారి ఇలాంటి తప్పు జరగదు అని బతిమిలాడడంతో సముద్ర మళ్లీ వచ్చి ఈ సినిమాను పూర్తి చేశారట. అయితే సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం మళ్లీ జీవితా రాజశేఖర్ పేరు వేసుకున్నారట. ఇక ఎవడైతే నాకేంటి సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.