ప్రముఖ ఆధ్యాత్మక వేత్త, అవధాని గరికపాటి నరసింహారావు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సాహిత్యం విభాగం నుంచి పద్మశ్రీ అవార్డు పొందిన గరికపాటి నరసింహారావు గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారెవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. తనదైన స్టైల్ లో ప్రవచనాలు ఇస్తూ నేటి కాల పరిస్ధితుల గురించి ఉన్నది ఉన్నట్లు క్లీయర్ గా మొహానే చెప్పేస్తుంటారు. అతను తరచుగా చిటికెడు వ్యంగ్యం కామెడీతో నిజ జీవిత ఉదాహరణలను జతచేస్తాడు. ఇప్పటికే ఆయనకు సంబంధించిన చాలా వీడియోలు నెట్టింట తెగ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.
గరికపాటి నరసింహారావు పశ్చిమ గోదావరి జిల్లా, పెంటపాడు మండలం బోడపాడు అగ్రహారంలో వెంకట సూర్యనారాయణ, వెంకట రమణమ్మ దంపతులకు 1958 సెప్టెంబర్ 14వ తేదీన విలంబి నామ సంవత్సరంలో జన్మించారు. గరికిపాటు ఎంఏ, ఎంఫిల్, పీహెచ్‌డీ పూర్తి చేశారు. సుమారు 30 ఏళ్ల పాటు ఉపాద్యాయుడిగా సేవలందించారు. హిందూ సంస్కృతిని ఉన్నతీకరించడానికి ప్రోత్సహించడానికి రామాయణం, మహాభారతం,భగవద్గీత ఇతర పవిత్ర గ్రంథాలను క్రమం తప్పకుండా చర్చిస్తారు గరికపాటి.
ఇక రిపబ్లిక్ డే సందర్భంగా భారత ప్రభుత్వం అత్యున్నత అవార్డు పద్మశ్రీకి ఆయనను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన అభిమానులు చాలా మంది సంతోషపడ్డారు. సాహిత్యరంగంలో గరికపాటి అందించిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. ఇక గరికపాటికి పద్మశ్రీ ఇవ్వడం పట్ల సింగర్ చిన్మయి అసహనం వ్యక్తం చేసింది.
సింగర్ గాను డబ్బింగ్ ఆర్టిస్ట్ గాను ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకుంది చిన్మయి.. నిరంతరం మహిళల సమస్యలపై, ఈ సమాజంలో ఆడవాళ్లకు జరుగుతున్న అన్యాయాలపై పోరాడుతూ… వారిలో చైతన్యాన్ని నింపుతుందన్న సంగతి తెలిసిందే. అయితే గరికపాటికి పద్మశ్రీ ఇవ్వడం పై మండిపడుతూ..అప్పట్లో గరికపాటి నరసింహారావు మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్స్ ను ఇన్స్టాగ్రామ్ స్టోరీ లో షేర్ చేస్తూ..సమచలన కామెంట్స్ చేసింది.
ఆడవాళ్ళు అలాంటి డ్రెస్సులు ధరిస్తే మగవాళ్ళు తట్టుకోలేరని అన్న గరికపాటి మాటల వీడియోను షేర్ చేయడం సంచలనంగా మారింది. అయితే చిన్మయి గరికపాటి పై సెటైర్లు వేయడం పట్ల ఆయన అభిమానులు ఆమె ను తిట్టిపోస్తున్నారు. గరికపాటి లాంటి గొప్ప వ్యక్తి పద్మశ్రీ ఇస్తే నీకు ఎందుకు అంత కడుపు మంట తల్లి అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు.