విడాకులు, బ్రేకప్ ఈ మధ్య కాలంలో ఓ ఫ్యాషన్ గా మారిపోయింది. ఒక అమ్మాయికి అబ్బాయి..అబ్బాయికి అమ్మాయి నచ్చితే వెంటనే లవ్ అనేయడం..ఏదో గిఫ్ట్‌లు..వాళ్ళ పేరుతో టాటూలు వేయించుకుని..అమర ప్రేమికులు అని చెప్పుకోవడం..ఫైనల్ గా చిన్న గొడవలకే బ్రేకప్..మనసు విరిగిపోయిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టడం. ఒక్కవేళ అలా ప్రేమించి ధర్యం చేసొ పెళ్లి చేసుకున్నా..కొంత కాలానికి బాండింగ్ కుదరండం లేదు.. నన్ను కంట్రోల్ చేస్తున్నాడు..నన్ను పట్టించుకోవడం లేదంటూ చిన్న చిన్న రీజన్స్ కే పవిత్రమైన పెళ్లి బంధానీ తెంచ్చుకోవడం. ఈ మధ్య కాలంలో మనం ఇలాంటివి డైలీ వింటూనే ఉన్నాం.
ఇక తాజాగా యూట్యూబ్ స్టార్స్ అయిన షణ్ముఖ్ జశ్వంత్-దీప్తీ విడిపోయిన సంగతి తెలిసిందే. షన్నుతో విడిపోతున్నట్లు అతని ప్రేయసి దీప్తి సునయన తెల్చీ చెప్పేసింది. గత కొద్ది రోజులుగా వీరిద్దరు విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్చల్ చేశాయి. తాజాగా ఈ వార్తలు నిజమేనంటూ తెల్చేసింది దీప్తి. దీప్తి ఇప్పుడు తన తాజా సోషల్ మీడియా పోస్ట్‌లో తన ప్రియుడు షణ్ముఖ్ జస్వంత్‌తో విడిపోయినట్లు అధికారికంగా ప్రకటించింది.
ఇక దీనికి రీజన్ మనకు తెలిసిందే.. బయట ఒక్క అమ్మాయితో కనెక్షన్ ఉండి కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లాక ఎమోషనల్ కనెక్ట్ అంటూ సిరి దగ్గరైయాడు షన్నూ..ఇవన్నీ తన ఇంట్లొ నుండి చూస్తూ వచ్చిన దీపు..ఫైనల్ గా అతనితో లవ్ బంధం తెంచ్చేసుకుంది. దీంతో కొందరు అభిమానులు బాధపడ్డారు. ప్లీజ్ విడిపోకండి అంటూ కామెంట్స్ పెడుతున్న క్రమంలో ఓ షాకింగ్ మ్యాటర్ లీక్ అయ్యింది.
అది ఏమిటంటే.. దీప్తీ కి బ్రేకప్ చెప్పడం..షన్ను ని దూరం పెట్టడం అస్సలకి ఇష్టం లేదట..వాళ్ల పేరంట్స్ నే బెదిరించి మరి..దీప్తీ దగ్గర ఇలా చెప్పించారట. మొదటినుండి షన్ను అంటే ఒక మంచి అభిప్రాయం ఉన్నా ..హౌస్ లో ఆయనగారు చేసిన పనుల కారణంగా బంధువులు సూటిపోటి మాటలు భరించలేక..ఇలాంటి వాడినా మి కూతురు లవ్ చేసింది అని వెటకారం గా మాట్లాడటం మొదలు పెట్టారట ఈ బాధలు భరించలేకనే వాళ్ళ పెరంట్స్ ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకున్నారట. 5 Years లవ్ చేసిన దీప్తికి తెలియదా షన్ను ఒరిజినల్ క్యారెక్టర్ గురించి అంటూ నెట్టింట దీప్తిని తిట్టిపోస్తున్నారు షన్నూ ఫ్యాన్స్.