శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 2007లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమా హ్యాపీడేస్. ఈ సినిమా అప్పట్లో ఎలాంటి విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. దిల్ రాజు ఆ సినిమాను తక్కువ రేటుకు కొనుక్కొని భారీ స్థాయిలో విడుదల చేశారు. సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకొని ఆయనకు కాసుల వర్షాన్ని కురిపించింది. హ్యాపీడేస్ సినిమా వచ్చి 14 ఏళ్లయినా కూడా ఇంకా టీవీలలో మంచి రెంటింగ్ అందుకుంటోంది.
ఇక అందులో నటించిన నటీనటులు కూడా జీవితానికి సరిపడే గుర్తింపును అందుకున్నారు. ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఎప్పుడు తన సినిమాలో కొత్త నటులకు పరిచయం చేస్తుంటారు. ఇక హ్యాపీడేస్ సినిమాలో చాలా మంది నటులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈ సినిమాలో చాలా మందిని కొత్త వాళ్ళను తీసుకుని వాళ్ళకు లైఫ్ ఇచ్చారు.
వాళ్లలో మనం ముఖ్యంగా చెప్పుకోవల్సింది తమన్నా,నిఖిల్ ఈ ఇద్దరు ఇప్పుడు మంచి పోజీషన్ లో ఉన్నారు. ఇక వరుణ్ మొదట్లో పర్వాలేదు అనిపించినా ఇప్పుడు మాత్రం డిజాస్టర్ హీరో అయ్యడు. అయితే ఈ సినిమాలో అప్పు గా కనిపించిన అమ్మాయి గుర్తుంది కదా. హా..మర్చిపోయే నటన ఆమె చేసింది గుర్తుండే ఉంటుంది. నిఖిల్ క్లోజ్ ఫ్రెండ్‌గా మూవ్ అయ్యే అప్పు అలియాస్ అపర్ణ. హ్యాపీడేస్ సినిమా చూసిన ప్రతి ఒక్కరు అప్పు క్యారెక్టర్‌ని మర్చిపోలేరు. అంతలా ఆ పాత్రలో ఒదిగిపోయింది గాయత్రీరావు. తొలి సినిమాయే అయినా.. ఎంతో అనుభవం ఉన్నట్లు నటించింది.
అప్పు అసలు పేరు గాయత్రి రావు. సీనియర్ నటి అయిన బెంగళూరు పద్మ కూతురు అయిన గాయత్రి వరుసగా సినిమా ల్లో ఆఫర్లు దక్కించుకుంటుందని అంతా భావించారు. హ్యాపీడేస్ తర్వాత ఆమెకు అంతగా ఆఫర్లు రాలేదు.హ్యాపీ డేస్ సినిమా తరువాత రామ్ చరణ్ నటించిన ‘ఆరంజ్’పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’ సినిమాలోనూ నటించిన గాయత్రిరావు. ఆ తరువాత పెద్దగా తెర పై కనిపించలేదు. సినిమా అవకాశాలు రాకపోవడంతో 2019లో వివాహం చేసుకొని చెన్నైలో స్థిరపడిపోయింది. ఇప్పుడు ఈమెను చూస్తే కనీసం గుర్తు కూడా పట్టరు.
అంతగా మారిపోయింది అప్పు. అప్పుడు చాలా సన్నగా కనిపించిన ఈ అమ్మాయి ఇప్పుడు బరువు పెరిగిపోయింది. ఇక ఆ ఫోటోలు చూసిన నెటిజన్స్ గుర్తుపట్టనంత మారిందే అంటూ ఫొటోలను షేర్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ మధ్యనే ఓ ఇంటర్వ్యుల్లో మాత్లాడుతూ ..అవకాశం వస్తే మళ్లీ నటిస్తానని చెప్పింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది ఈ బొద్దుగుమ్మ గాయత్రి రావు. మరి చూడాలి అమ్మడుకి ఎలాంటి ఆఫర్లు ఇస్తారో డైరెక్టర్స్..?