Movies2013లో విడాకులు తీసుకుంటామ‌ని చెప్పిన స‌మంత‌.. ఇదే సాక్ష్యం...!

2013లో విడాకులు తీసుకుంటామ‌ని చెప్పిన స‌మంత‌.. ఇదే సాక్ష్యం…!

ప్ర‌స్తుతం సినిమా ప‌రిశ్ర‌మ‌లో అంతా విడాకుల ట్రెండ్ న‌డుస్తోంది. అటు వెండితెర సెల‌బ్రిటీల నుంచి ఇటు బుల్లితెర సెల‌బ్రిటీల వ‌ర‌కు అంద‌రూ విడాకుల విష‌యాల‌తో వార్త‌ల్లో ఉంటున్నారు. ఆ మాట‌కు వ‌స్తే గ‌త ఆరేడు నెల‌లుగా ఈ ట్రెండే న‌డుస్తోంది. స‌మంత – నాగ‌చైత‌న్య విడాకుల త‌ర్వాత ఎంతో మంది చాలా సింపుల్‌గా విడాకులు తీసేసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌ట‌న‌లు చేసేశారు. అటు బాలీవుడ్‌లో మిస్ట‌ర్ ఫ‌ర్‌ఫెక్ట్‌గా మంచి పేరున్న అమీర్‌ఖాన్ త‌న రెండో భార్య కిర‌ణ్‌రావుకు విడాకులు ఇచ్చి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.

ఇక తాజాగా సౌత్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వ‌ర్య‌, హీరో ధ‌నుష్ కూడా విడిపోతార‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. అస‌లు వీరి మ‌ధ్య ఇంత పెద్ద గ్యాప్ ఉంద‌ని కూడా ఎవ్వరూ భావించ‌లేదు. అయితే వీరు చాలా సింపుల్‌గా విడాకులు తీసుకుంటున్న‌ట్టు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఇదిలా ఉంటే అక్కినేని వంశం హీరో నాగచైత‌న్య – స్టార్ హీరోయిన్ స‌మంత విడాకుల వ్య‌వ‌హారం ఇప్ప‌ట‌కీ చాలా మందికి జీర్ణించుకోలేని అంశంగా ఉంది.

నాలుగేళ్ల దాంప‌త్య జీవితం త‌ర్వాత వీరు విడిపోయారు. 2017లో వీరు పెళ్లి చేసుకుని 2021లో విడిపోయారు. అయితే స‌మంత పెళ్లి కాక‌ముందే 2013లోనే తాను విడాకులు తీసుకుంటాన‌ని చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. సామ్ 2013లో ట్విట్ట‌ర్‌లో ఫాలోవ‌ర్స్‌తో చిట్ చాట్ చేసింది. అందులో ఓ అభిమాని స‌మంత‌ను పెళ్లి, విడాకుల గురించి ఓ ప్ర‌శ్న అడిగాడు. దానికి స‌మంత చాలా వెరైటీగా ఆన్స‌ర్ ఇచ్చింది.

నేను వివాహం చేసుకుంటా.. త‌ర్వాత విడాకులు ఇస్తాను… మీరు చూస్తూ ఉండండి.. మ‌న‌మిద్ద‌రం క‌లిసి డ్యాన్స్ చేస్తాం అంటూ రిప్లే ఇచ్చింది. అప్పుడు స‌మంత కాక‌తాళీయంగా అందే ఏమో గాని.. ఇప్పుడు నిజంగానే నాగ‌చైత‌న్య‌ను పెళ్లి చేసుకుని నాలుగేళ్ల‌కే విడాకులు ఇచ్చేసింది. అయితే అప్పుడు చేసిన ట్వీట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఇక చైతుతో విడాకుల త‌ర్వాత స‌మంత ప్ర‌తి రోజు ఏదో ఒక అంశంతో వార్త‌ల్లో ఉంటోంది. హాట్ హాట్‌గా ఫొటోల‌కు పోజులు ఇస్తుండ‌డంతో పాటు వ‌రుస పెట్టి సినిమాలు చేయ‌డం.. హాట్ హాట్ ఐటెం సాంగులు చేస్తూ వార్త‌ల్లో ఉంటోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news