Moviesనాగార్జున పాలిట ఐరెన్‌లెగ్‌గా రోజా..!

నాగార్జున పాలిట ఐరెన్‌లెగ్‌గా రోజా..!

రోజా ఇప్పుడు తెలుగు గడ్డపై ఈ పేరు ఒక సంచలనం. రెండున్నర దశాబ్దాల క్రిందట రోజా స్టార్ హీరోయిన్‌గా టాలీవుడ్లో ఒక వెలుగు వెలిగారు. తెలుగుతో పాటు తమిళంలో స్టార్ హీరోల పక్కన ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించారు. చిత్తూరు జిల్లాకు చెందిన రోజా 1990వ దశకంలో సూపర్ డూపర్ హిట్లతో ఇండస్ట్రీనే ఏలేశారు. అప్పట్లో రమ్యకృష్ణ – మీనా – నగ్మా – సౌందర్య – ఆమని లాంటి స్టార్ హీరోయిన్లకు పోటీగా ఎన్నో సినిమాల్లో నటించి టాలెంట్ ప్రూవ్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే రోజా బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్ లాంటి స్టార్ హీరోల పక్కన నటించే సూపర్ డూపర్ హిట్లు కొట్టారు.

స్టార్ హీరోలకు అందరికీ రోజా సూపర్ డూపర్ హిట్లు ఇచ్చినా… మరో సీనియర్ హీరో నాగార్జున కు మాత్రం ఆమె ఐరన్ లెగ్ గా మారింది. రోజా నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు అన్ని డిజాస్టర్స్ అయ్యాయి. 1993లో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఉప్ప‌ల‌పాటి నారాయణరావు దర్శకత్వంలో ర‌క్ష‌ణ‌ సినిమా వచ్చింది. ఈ సినిమాలో నాగార్జున – శోభన హీరో, హీరోయిన్లుగా నటించారు. రోజా ప్రత్యేక గీతంలో నటించింది. అయితే ర‌క్ష‌ణ బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా సక్సెస్ కాలేదు.

ఆ తర్వాత 1995లో ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో వజ్రం సినిమా వచ్చింది. ఈ సినిమాలో నాగార్జున, రోజా హీరో హీరోయిన్లుగా నటించారు. అంతకుముందు ఎస్ వి. కృష్ణారెడ్డి కొబ్బరి బొండాం – మాయలోడు – రాజేంద్రుడు గజేంద్రుడు – నెంబర్ వన్ – యమలీల లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలతో టాప్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు.

అలాంటిది ఎస్ వి.కృష్ణారెడ్డి తీసిన వజ్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. అలా రోజా – నాగార్జునకు ఏమాత్రం కలిసిరాలేదు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన ఆమె ముందు తెలుగుదేశం పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వైసీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీ నుంచి ఆమె రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news