Moviesఆ ఇంటికి కోడలు అవ్వాలని ఉంది.. ఇన్ డైరెక్ట్ గా హింట్...

ఆ ఇంటికి కోడలు అవ్వాలని ఉంది.. ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇస్తుందా..?

కన్నడ బ్యూటీ రష్మిక మందన ప్రస్తుతం అమ్మడు హవా నడుస్తుంది. అందుకే వరుస సినిమాలు చేస్తూ..చేసిన ప్రతి సినిమా హిట్ కొడుతూ ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించి సరికొత్త రికార్డ్ క్రియెట్ చెసిన ఈ బ్యూటీ ఇటు తెలుగులోను అటు బాలీవుడ్ లోను మధ్యలో కోలీవుడ్ ని కూడా కవర్ చేస్తూ మంచి మంచి సినిమా అవకాశాలు అందుకుంటుంది ఈ బ్యూటీ. ఇండియన్ క్రష్ గా పేరు తెచ్చుకున్న రష్మిక.. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

షూటింగ్ అంటూ ఎంత బిజీగా ఉన్నా నెలకు ఒక్కసారి అయినా అభిమానులతో ముచ్చటిస్తుంది. ఇక ఈ క్రమంలోనే ఆమె అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ కొత్త అప్డేట్స్ ఇస్తుంటుంది. తాజాగా అభిమానుల చిట్ చాట్ లో పెళ్లిపై తన మనసులో మాట బయటపెడుతూ అసలు విషయం చెప్పేసింది క్రేజీ బ్యూటీ రష్మిక మందన. ప్రస్తుతం సౌత్ ఇండియన్ తెరపై వరుస ఆఫర్స్‌తో బిజీగా ఉన్న ఈ కన్నడ బ్యూటీకి తమిళ సంప్రదాయం బాగా నచ్చిందట. ఎప్పటికైనా ఆ ఇంటి కోడలినే కావాలనేది తన కోరిక అంటూ ఓపెన్ అయింది రష్మిక.

 

రష్మిక మాట్లాడుతూ.. తమిళనాడు అంటే తనకు ఎంతో ఇష్టమని.. తమిళ సంప్రదాయం, సంస్కృతి తనను ఎంతగానో ఆకర్షించింది అని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా అక్కడి వంటకాలు అంటే చాలా ఇష్టమని తెలియజేసింది. అందుకే ఎప్పటికైనా తమిళ ఇంటి కోడలు కావాలన్నదే తన కోరిక అని తెలియజేసింది. అయితే ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు అమ్మడు మనకు ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇస్తుందా..? అని అనుకుంటున్నారు.

మరి కొందరు అమ్మడు తనకు కాబోయే భర్తని ముందే సెలక్ట్ చేసుకుని ఉంటుందని అందుకే ఇంత పక్కాగా తమిళ వాడినే పెళ్లి చేసుకోవాలని ఉంది అని చెప్పిందని అంటున్నారు. గతంలో కన్నడ హీరో రక్షిత్ శెట్టితో ప్రేమాయణం నడిపిన రష్మిక.. అతనితో నిశ్చితార్థం కూడా చేసుకొని చివరకు బ్రేకప్ చెప్పింది. అందుకు కారణాలేంటనేవి పెద్దగా బయటకురానప్పటికీ మళ్ళీ ఇలా రష్మిక పెళ్లి మ్యాటర్ తీసుకురావడం జనాల్లో హాట్ టాపిక్ అయింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news