మెగాస్టార్ చిరంజీవి తనయుడుగా వెండితెర ఎంట్రీ ఇచ్చాడు మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో హీరోగా పరిచయం అయిన చరణ్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన తన రెండో సినిమా మగధీరతోనే ఒక్కసారిగా ఇండస్ట్రీలో పాతుకుపోయాడు. ఇప్పుడు తెలుగు సినిమా యువహీరోలలో రామ్‌చరణ్ ఓ స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. తాజాగా మరోసారి తనకు మగధీర లాంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన రాజమౌళి దర్శకత్వంలో రు. 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమాలో అల్లూరి సీతారామ రాజు పాత్రలో నటించాడు.
సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా నేపథ్యంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ ఇప్పటివరకు నటించినవి తక్కువ సినిమాలే అయినా విజయాలు ఎక్కువ. చరణ్ ప్రస్తుతం త్రిబుల్ ఆర్ తో పాటు చరణ్ తన తండ్రి చిరంజీవితో కలిసి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమాలో కూడా సిద్ధ అనే కీలకపాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి మొదటి వారంలో రిలీజ్ కానుంది. ఇక సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో కూడా మరో సినిమా చేస్తున్నాడు.
రామ్ చరణ్ కామినేని వంశ ఆడపడుచు ఉపాసనను పెళ్లి చేసుకున్నాడు. చరణ్ తన కెరీర్లో ఎంతో మంది హీరోయిన్లతో కలిసి నటించాడు. అయితే ఏ హీరోయిన్ విషయంలోనూ చరణ్ కు లింకు ఉన్నట్టు వార్తలు రాలేదు. ఒక్క హీరోయిన్ విషయంలో చరణ్ కు క్లీన్ ఇమేజ్ ఉంది. అయితే ఒకే ఒక్క హీరోయిన్ తో మాత్రం చరణ్‌కు ఎఫైర్ ఉందన్న వార్తలు అప్పట్లో గట్టిగా వినిపించాయి. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. చరణ్ తొలి సినిమా చిరుత హీరోయిన్ నేహా శర్మ. చిరుత లో బాగా హాట్‌హాట్‌గా అందాలు ఆరబోసింది. ప్రకాష్ రాజ్ కూతురుగా చరణ్ ను బాగా రెచ్చగొట్టే పాత్ర నేహ నటించింది. ఆ సినిమాలో వాళ్ళ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది.
ఈ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవడంతో అప్పట్లో కొందరు వీటిని మ్యాగజైన్స్ వారు వారిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు వేసి.. వారిద్దరూ ప్రేమలో ఉన్నారని రకరకాల వార్తలు రాసేశారు. అయితే ఈ రూమర్లపై రామ్ చరణ్ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. తన తొలి సినిమా హీరోయిన్ నేహా శర్మతోనే తనకు ఎఫైర్ ఉందని అంటగట్టారు… తనకు రూమర్లు అంటే ఎలా పుడతాయో ఈ వార్త చూశాక అర్థమైందని చెప్పాడు. ఆ తర్వాత ఇలాంటివి తనకు మామూలు అయిపోయాయి అని చరణ్ తెలిపాడు.