Moviesఆ హీరో టార్చ‌ర్‌తో సెట్లోనే ఏడ్చిసిన రంభ‌... !

ఆ హీరో టార్చ‌ర్‌తో సెట్లోనే ఏడ్చిసిన రంభ‌… !

టాలీవుడ్ లో వెటర‌న్‌ హీరోయిన్ రంభ ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది. పదేళ్లపాటు ఆమె ఇండస్ట్రీని ఏలింది. రంభ అసలు పేరు విజయలక్ష్మి. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు చెందిన విజయలక్ష్మి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాక ఆమె పేరు రంభగా మార్చుకున్నారు. తెలుగులో అగ్ర హీరోలు అందరితోనూ కలిసి నటించిన రంభ ఆ తర్వాత తమిళంలోనూ స్టార్ హీరోల పక్కన నటించే ఎన్నో సూపర్ డూపర్ హిట్లు కొట్టింది. ఆ తర్వాత భోజ్‌పురిలో అయితే ఆమె ఒక వెలుగు వెలిగి పోయింది. భోజపురి ప్రేక్షకులు రంభను ఒక దేవతగా ఆరాధించే చేశారు. ఆ స్థాయిలో ఆమెకు పాపులారిటీ వచ్చింది.

ఇక తెలుగులో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. జెడి చక్రవర్తి – రంభ జంటగా రాఘవేంద్రుడు బొంబాయి ప్రియుడు సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా షూటింగ్ లో భాగంగా హీరో జె.డి.చక్రవర్తి చేసిన పనికి రంభ బోరున ఏడ్చేసింది అట. రాఘవేంద్ర రావు సినిమాలు అంటేనే పాటల్లో పూలు… పండ్లు హీరోయిన్ల పై విసరటం ఉంటుంది.

అస‌లు పూలు, పండ్లు హీరోయిన్ల బొడ్డు మీద‌నో, న‌డుం మీద‌నో విస‌రందే రాఘ‌వేంద్రుడి సినిమా పూర్తికాదు. ఇక బొంబాయి ప్రియుడు సినిమాలో ఒక పాట షూట్ చేస్తూ ఉండగా రంభను బత్తాయి పండుతో నడుము మీద కొట్టాల్సి ఉందట. అప్పుడు జెడి చక్రవర్తి బత్తాయిపండు విసిరిన‌ తర్వాత పక్కనే ఉన్న పెద్ద పుచ్చకాయను చూపిస్తూ నీమీద పుచ్చకాయ విసిరే సీన్ ఉంద‌ని అన‌డంతో రంభ భయపడిందట.

వెంటనే రాఘవేంద్రరావు అక్కడికి వచ్చి మీ ముచ్చట్లు అయిపోయాక చెప్పండి… అప్పుడే తాను సీన్ షూట్ చేస్తాం అని ఆగ్రహం వ్యక్తం చేశారట. తన తప్పు లేకపోయినా జె.డి వల్ల తాను దర్శకుడుతో తిట్లు తినాల్సి వచ్చిందని రంభ బోరున ఏడ్చేసిందట. అలా ఆ సినిమా చాలా ఎంజాయ్ చేస్తూ చేశామ‌ని రంభ‌, జేడీ చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news