ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ ఎవరు అని అడిగితే అందరి నొటినుండి వచ్చే సమాధానం “రాజమౌళి”. సినీ కథారచయిత విజయేంద్ర ప్రసాద్ కుమారుడు, టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళిగా తన పేరుని ప్రపంచ వ్యాప్తంగా వినిపించేలా మార్చుకున్నాడు ఈ జక్కన్న. ఎప్పుడూ చెక్కుచెదరని నవ్వుతో కొత్త ఆలోచనలకు రూపమిస్తూ దూసుకుపోయే ఆయన సినిమాలంటే టాలీవుడ్ ప్రజలకే కాదు..ఇతర భాష ప్రజలకు కూడా ఇష్టం.
బాహుబలి లాంటి భారీ సినిమాతో తెలుగోడి సత్తా ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత కూడా రాజమౌళిదే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దాదాపు ఐదేళ్లపాటు ఈ సినిమా కోసం కష్టపడిన జక్కన్న.. ఆశించిన దానికి మించి ఫలితం రాబట్టారు. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన ప్రభాస్ కెరీర్ ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పనవసరంలేదు. ఇప్పుడు ఈఅయన్ ఏ హీరో తీసుకోని విధంగా 150 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటూ నెం 1 హీరోగా కొనసాగుతున్నాడు.
ఇక తెరపై నవరసాలను సమపాళ్లలో రంగరించి చూపించగల సమర్దుడిగా పేరు తెచ్చుకున్న రాజమౌళి.. ఇప్పటివరకు ఒక్క పరాజయం కూడా చవిచూడకపోవడం విశేషం. ఇప్పటికి ఆయన మొత్తం 12 సినిమాలు రూపొందించారు. అందులో సింహాద్రి, ఈగ, ఛత్రపతి, మగధీర, బాహుబలి దేనికవే ప్రత్యేకంగా నిలుస్తూ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించాయి. అయితే ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాల్లో తక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమా ఏదైన ఉంది అంటే అది “సై” మూవీ మాత్రమే.
రాజమౌళి కెరీర్ లో ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవగా సై సినిమా మాత్రం కమర్షియల్ గా భారీ విజయం సాధించిన సినిమా అయితే కాదు. ఈ సినిమా నిర్మాత భారతికి ఎక్కువ మొత్తంలో లాభాలు తీసుకొని రాలేదు. కలెక్షన్స్ పరంగా అటూ ఇటూ ఉన్నా కానీ టాక్ పరంగా మాత్రం సినిమా అందరిని ఆకట్టుకుంది.
అయితే ఈ సినిమా ద్వారా రగ్బీ గేమ్ గురించి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల అందరికి పరిచయం చేసిన రాజమౌళి ..మొదట హీరోగా నితిన్ ని అనుకోలేదట. ఓ స్టార్ హీరోని ఈ సినిమాలో పెట్టడానికి టరి చేసారట..కానీ కొన్ని కారణాల చేత కుదరకపోవడంతో..ఫైనల్ గా నితిన్ ను సెలక్ట్ చేసారట. ఇక ఈ సినిమా తరువాత నితిన్ కెరీర్ దశ ఎలా తిరిపోయిందో మనకు తెలిసిందే.