ప్రస్తుతం ఉన్న జెనరేషన్ లో చాలా మంది టీవీలు చూడడం కంటే అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి ఖాతాలను ఎక్కువగా వాడుతున్నారు. అందుకే ఇప్పుడు వాటికి క్రేజ్ బాగా పెరిగింది. పైగా కరోనా లాక్ డౌన్ కారణంగా జనాలు ఇంటి నుండి బయటకు వెళ్ళే పరిస్ధితి లేక వీటికే ఎక్కువ అలవాటు పడ్డారు. దీంతో వీటి సబ్ స్క్రిప్టెన్ష్స్ ఛార్జీలు కూడా బాగా పెరిగాయి. ఇక బడా బడా సినిమాలు అయినా రిలీజ్ అయ్యాక ఎలాగో కొన్ని రోజులకు ఇలాంటి ఓటీటీలకు ఇస్తారు కనుక ప్రజలు వీటికే అలవాటు పడిపోయారు. ఇక కొన్ని సినిమాలు అయితే డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.
అయితే తాజా సమాచారం ప్రకారం ..రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ సినిమాకి అమెజాన్ అద్దిరిపోయే ఆఫర్ ఇచ్చిన్నట్లు తెలుస్తుంది. అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ మల్టీ స్టారర్ మూవీ రౌద్రం.. రణం.. రుధిరం ‘ఆర్‌ఆర్‌ఆర్’ దేశవ్యాప్తంగా కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరగడం, థియేటర్ ఆక్యుపెన్సీ, పలు రాష్ట్రాల్లో స్వల్ప లాక్‌డౌన్ వల్ల ఈస్ ఇనిమా విడుదల వాయిదా వేసారు మేకర్స్. దీంతో తీవ్ర నిరాశకు గురైయ్యారు అభిమానులు. అయితే ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో ఆర్‌ఆర్ఆర్ మేకర్స్‌తో అద్భుతమైన ఆఫర్ అందించింది.
ఈ మధ్యకాలంలో కొంతమంది దర్శక నిర్మాతలు సినిమాని పే-పర్-వాచ్ మోడల్ లో విడుదల చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అమెజాన్ తరచుగా రూ. 30 కోట్లకుపైగా పెట్టుబడితో బిగ్-టికెట్ ఎంటర్‌టైనర్‌లను కొనుగోలు చేస్తుంది. అంటే పలు పెద్ద చిత్రాలను కొనుక్కొని పే-పర్ వాచ్ రూపంలో ఓటీటీలో విడుదల చేస్తుంది. “ఆర్ ఆర్ ఆర్” సినిమాని కూడా అలానే విడుదల చేస్తే కనీసం సినిమాకి 200 కోట్ల దాకా రెవెన్యూ వస్తుందట. కానీ ఈ చిత్ర నిర్మాతలకు ఇది ఏమాత్రం ఇష్టం లేదట.
అందుకే ఆమెజాన్ వారు ఇచ్చిన ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించారని తెలుస్తోంది. ఇలా యూఎస్‌ఏ సర్క్యూట్‌లో తరచుగా కొంటూ రిలీజ్ చేస్తుంది. కానీ భారతీయ మార్కెట్‌లో ఇలాంటి ప్రయోగం మాత్రం ఇప్పటివరకూ చేయలేదు అమెజాన్. “ఆర్ ఆర్ ఆర్” వంటి సినిమాను థియేటర్లలో విడుదల చేస్తే 400 కోట్లకు పైగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు నమోదు అవుతాయని అందుకే ఈ పే-పర్-వాచ్ మోడల్ కానీ డైరెక్ట్ గా ఓటీటీ లో విడుదల చేయడం కానీ ఇటువంటి వి పాన్ ఇండియన్ సినిమాకి వర్కౌట్ అవ్వవని కరాఖండిగా చెప్పేశారు దర్శకనిర్మాతలు.