MoviesR R R ఎఫెక్ట్‌... ఎన్టీఆర్‌కు అన్ని కోట్ల న‌ష్ట‌మా...!

R R R ఎఫెక్ట్‌… ఎన్టీఆర్‌కు అన్ని కోట్ల న‌ష్ట‌మా…!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ చివరిసారిగా 2018లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సినిమాలో మాత్రమే కనిపించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. టెంపర్ నుంచి అరవింద సమేత వరకు ఎన్టీఆర్ వరుసగా 5 హిట్లతో దూసుకుపోతున్నాడు. అయితే ఇలాంటి సమయంలో పాన్ ఇండియా ఇమేజ్ వస్తే తన క్రేజ్ మరింత పెరుగుతుందని… రాజమౌళితో త్రిబుల్ ఆర్ సినిమా అంగీకరించాడు. ఏ ముహూర్తాన ఎన్టీఆర్ ఈ సినిమా ఒప్పుకున్నాడో కాని ఇక్క‌డే అయిపోయాడు.

త్రిబుల్ ఆర్ సినిమా సూపర్ హిట్ అయితే ఎన్టీఆర్ కు పాన్ ఇండియా ఇమేజ్ వస్తుంది అనటంలో సందేహం లేదు. అయితే త్రిబుల్ ఆర్ సినిమా షూటింగ్ లేట్ అవడంతో పాటు మరో రెండు సార్లు క‌రోనా రావడం…. సినిమా షూటింగ్ వాయిదా పడటం… ఇప్పుడు రిలీజ్ కూడా మూడు, నాలుగు సార్లు వాయిదా పడడంతో మూడున్నర సంవత్సరాలుగా ఎన్టీఆర్ సినిమా లేకుండా పోయింది.

ఎన్టీఆర్ రు. 35 కోట్ల రెమ్యూనరేషన్ తో త్రిబుల్ ఆర్ సినిమా చేసేందుకు ఓకే చెప్పినట్టు టాక్. ఎన్టీఆర్ ఈ మూడు సంవత్సరాల్లో ఈ ఒక్క సినిమా మీదే కూర్చుని ఉన్నాడు. ఇదే టైంలో రామ్‌చ‌రణ్ ఓవైపు ఆచార్య సినిమా పూర్తి చేశాడు. మరోవైపు శంకర్ సినిమా కూడా రెండు షెడ్యూల్స్‌ షూటింగ్ అయిపోయాయి. ఈ మూడు సంవత్సరాల్లో ఎన్టీఆర్ ఎలా లేదన్న ఐదారు సినిమాలు ఈజీగా పూర్తి చేసేవాడు.

బన్నీ కూడా అల వైకుంఠపురంలో – పుష్ప లాంటి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు. ఈ రెండు సినిమాల‌తో భారీ రెమ్యున‌రేష‌న్ సొంతం చేసుకున్నాడు. ఇక ఎన్టీఆర్ ఎన్నో ఆశలు పెట్టుకున్న త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఆయనకు పాన్ ఇండియా ఇమేజ్ ఏ స్థాయిలో వస్తుందో ? రెమ్యునరేషన్ ఎలా పెరుగుతుందో అన్నది పక్కన పెడితే త్రిబుల్ ఆర్ కోసం ఏకంగా నాలుగైదు సినిమాలు వ‌దులు కోవాల్సి వచ్చింది.

ఈ లెక్కన చూస్తే ఎన్టీఆర్కు 120 నుంచి 150 కోట్ల నష్టం జరిగినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో నడుస్తున్నాయి. ఇప్పుడు ఈ న‌ష్టం క‌వ‌ర్ అవ్వాలంటే త్రిపుల్ ఆర్ త‌ర్వాత ఎన్టీఆర్‌కు తిరుగులేని పాన్ ఇండియా ఇమేజ్ రావ‌డంతో పాటు ఆయ‌న చేసే నెక్ట్స్ సినిమాలు కూడా అదే స్థాయిలో ఉండాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news