దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి త్రిబుల్ ఆర్ తర్వాత వరుస కమిట్‌మెంట్లతో దూసుకు పోతున్నాడు. త్రిబుల్ ఆర్ తర్వాత కేఎల్. నారాయణ బ్యానర్లో మహేష్‌బాబు హీరోగా తెరకెక్కే సినిమాను తెరకెక్కిస్తారు. ఈ సినిమా ఏ 2023లోనో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా తర్వాత రాజమౌళి బన్నీతో సినిమా చేయడం దాదాపు ఖరారు అయినట్టే. ఎలాంటి మార్పులు, చేర్పులు లేకపోతే మహేష్‌బాబు తర్వాత రాజమౌళి తీసేది బన్నీ ప్రాజెక్టే.
తాజాగా బన్నీతో సినిమా చేసేందుకు రాజమౌళి గీతా ఆర్ట్స్‌తో డీల్ కుదుర్చుకున్నారని అంటున్నారు. మగధీర తర్వాత రాజమౌళి – బన్నీ కాంబినేషన్ సెట్ చేసేందుకు అల్లు అరవింద్ విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే మగధీర టైంలో అరవింద్‌కు, రాజమౌళికి ఏవేవో విబేధాలు వచ్చాయన్న ప్రచారం జరిగింది. ఆ తర్వాత అవన్నీ సద్దుమణిగినట్టు ఉన్నాయి. ఇక ఇప్పుడు గీతా ఆర్ట్స్‌లో పని చేసేందుకు రాజమౌళి ఓకే చెప్పారనే అంటున్నారు.
రెండు, మూడు రోజుల క్రితమే ఈ డీల్ కూడా సెట్ అయ్యిందన్న టాక్ ఇండస్ట్రీలో గుప్పుమంటోంది. మహేష్ తర్వాత ప్రాజెక్టే బన్నీది ఉంటుందని అంటున్నారు. పుష్ప సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇక రాజమౌళితో సినిమా పడితే బన్నీ ఇప్పుడు ఇండియన్ స్టార్ అయిపోవడం ఖాయం. ఇక 2023- 24లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇక మహేష్‌బాబు సినిమా కోసం రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ స్క్రిఫ్ట్ వర్క్ రెడీ చేస్తున్నారు. మహేష్ ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో చేస్తోన్న సర్కారు వారిపాట సినిమా తర్వాత ఈ కాంబినేషన్ పట్టాలు ఎక్కుతుంది. ఆ తర్వాత బన్నీ సినిమా ఉంటుంది. బన్నీతో సినిమా కోసం అరవింద్ రాజమౌళికి ఇప్పుడే రు. 30 కోట్ల అడ్వాన్స్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. టోటల్ రెమ్యునరేషన్ ఎంత అన్నది తెలియకపోయినా.. పై మొత్తం అంతా అడ్వాన్సే అంటున్నారు. ఏదేమైనా రాజమౌళి లైనఫ్‌లో మరో క్రేజీ ప్రాజెక్టు అప్పుడే సెట్ అయిపోయింది.