ఒక్కోసారి సినిమా రంగంలో ఒక హీరో చేయాల్సిన కథను మరో హీరో చేసి హిట్లు కొడుతూ ఉంటారు. అలాగే కొన్నిసార్లు ఒక హీరో వదులుకున్న కథలతో మరో హీరో సినిమాలు చేసి డిజాస్టర్లు కూడా కొడుతుంటారు. ఒక హీరో వదులుకున్న కథతో మరో హీరో హిట్ కొడితే ఆ కథ వదులుకున్న హీరో చాలా ఫీలవుతూ ఉంటాడు. ఇలాగే ఒక హీరో కోసం అనుకున్న టైటిల్ ఏదైనా కారణాల వల్ల టైటిల్ మారిస్తే. అదే టైటిల్ మరో హీరో వాడుకుని హిట్లు కొడుతూ ఉంటారు.
ఇలాంటి సందర్భాల్లో ఒక్కోసారి వివాదాలు కూడా జరిగాయి. కళ్యాణ్‌రామ్ – గుణశేఖర్ మధ్య కత్తి టైటిల్ విషయంలో పెద్ద వివాదమే నడిచింది. చివరకు ఆ టైటిల్‌తో కళ్యాణ్‌రామ్ కత్తి సినిమా చేశాడు. తర్వాత గుణశేఖర్ తన సినిమాకు నిప్పు అనే టైటిల్ పెట్టుకున్నారు. ఆ రెండు సినిమాల్లో కత్తి ఓ మోస్తరుగా ఆడితే నిప్పు డిజాస్టర్ అయ్యింది. ఇక గతంలో సూపర్‌స్టార్ మహేష్‌బాబు కోసం రిజిస్టర్ అయిన ఓ టైటిల్‌ను ఆ తర్వాత ప్రభాస్ తన సినిమాకు వాడుకుని సూపర్ హిట్ కొట్టాడు.
ప్రభాస్ హీరోగా దశరథ్ దర్శకత్వంలో మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమా తెరకెక్కి హిట్ అయ్యింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన కాజల్ అగర్వాల్, తాప్సీ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 21, 2011లో రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించింది. ప్రభాస్ కెరీర్‌లోనే ఓ మంచి సినిమాగా నిలిచిపోయింది. తనకు నచ్చింది చేస్తే తనే పర్‌ఫెక్ట్.. అదే నలుగురికి నచ్చేలా చేస్తేనే అతడు మిస్టర్ పర్‌ఫెక్ట్ అన్న కాన్సెఫ్ట్‌తో ఈ సినిమా తెరకెక్కి ప్రేక్షకులను మెప్పించింది.
అయితే కిక్ సినిమాతో హిట్ కొట్టిన దర్శకుడు సురేందర్‌రెడ్డి మహేష్‌బాబు కోసం మాఫియా నేపథ్యంలో ఓ కథను రెడీ చేశాడు. ఆ కథ మహేష్‌కు కూడా నచ్చింది. ఆర్ ఆర్ మూవీ మేకర్స్ వాళ్లు ఆ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించేందుకు ముందుకు వచ్చారు. ఈ సినిమాకు మహేష్‌కు రు. 2 కోట్లు అడ్వాన్స్ కూడా ఇచ్చారట. ఈ సినిమాకు మిస్టర్ పర్‌ఫెక్ట్ టైటిల్ కూడా అనుకున్నారట. చివరకు ఆ సినిమా క్యాన్సిల్ అయ్యింది. అదే టైటిల్ ప్రభాస్ సినిమాకు వాడుకుని హిట్ కొట్టారు.