పూజా హెగ్డే సౌత్‌లో జీవా హీరోగా మాస్క్ సినిమాలో నటించినప్పుడు ఆమెను పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆ తర్వాత వరుణ్‌తేజ్ పక్కన ముకుంద సినిమా చేయడం ఆలస్యం.. ఆ తర్వాత ఇప్పటి వరకు అస్సలు క్షణం తీరిక లేకుండా పూజా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ పోయింది. చివరకు కరోనా టైంలో కూడా తీరిక లేకుండా బిజీగా ఉన్న పూజా ఇప్పుడు సడెన్‌గా ఖాళీ అయిపోయింది. అసలు ఆమెకు ఇప్పుడు ఛాన్సులు లేవనే తెలుస్తోంది.
అయినా కూడా ఆమె డిగ్నీటీ మెయింటైన్ చేయడంతో పాటు ఏదో ఫుల్ బిజీగా ఉన్నట్టుగా బిల్డప్ ఇస్తోందట. గతేడాది ఆమె నటించిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ విడుదలై ఓ మోస్తరు హిట్ కొట్టింది. ఇక ప్రభాస్ పక్కన ఆమె నటించిన రాధేశ్యామ్ గత రెండేళ్లుగా రిలీజ్ కోసం వెయిటింగ్‌లో ఉంది. ఆచార్య.. బీస్ట్ చిత్రాలు కూడా ఏప్రిల్ లో విడుదల కానున్నాయి. పూజా నటించిన సినిమాలు అన్నీ 2022 ఫస్టాఫ్‌లోనే రిలీజ్‌కు రెడీ అవుతాయి.
అటు హిందీలో సర్కస్ సినిమా కూడా రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇక ఆమె చేతిలో షూటింగ్‌కు రెడీగా ఉన్న సినిమాలేవి లేవు. ప్రస్తుతం పూజా చేతిలో మహేష్ – త్రివిక్రమ్ సినిమా తప్పా ఇంకేమీ లేవు. ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లేందుకు ఇంకా చాలా టైం ఉంటుంది. అయితే రెమ్యునరేషన్ విషయంలో పూజా ఏ మాత్రం తగ్గడం లేదట. వరుస హిట్ల నేపథ్యంలో ఆమె రెమ్యునరేషన్ విషయంలో కొండెక్కి కూర్చుందట.
రేటు విషయంలో ఏ మాత్రం వెనక్కు తగ్గకపోవడంతో టాలీవుడ్ దర్శక నిర్మాతలు సైతం ఆమెను వద్దనే చెప్పేస్తున్నారట. పూజ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రు. 3.5 నుంచి 4 కోట్ల వరకు డిమాండ్ చేస్తోందట. దీనికి తోడు ఫైవ్‌స్టార్ హోట్సల్, ఆమెకు ముగ్గురు, నలుగురు అసిస్టెంట్లతో పాటు వీళ్ల ఖర్చులు కూడా భరించాలన్న కండీషన్లు పెడుతోందట. పూజను కేవలం పెద్ద బ్యానర్లు మాత్రమే తట్టుకోగలవు అని.. అయితే వాళ్లు కూడా ఆ రేటుకు బాలీవుడ్‌లో ఇంకా క్రేజ్ ఉన్న హీరోయిన్లు వస్తుండడంతో పూజను లైట్ తీస్కొంటున్నారట.