వెండితెరపై చాలా యాక్టివ్‌గా ఉండే నటీనటులు తమ పర్సనల్ లైఫ్ గురించి బయట షేర్ చేసుకునేందుకు గతంలో ఇష్టపడేవారు కాదు. అయితే ఇప్పుడు నడుస్తోందంతా సోషల్ మీడియా యుగం. చివరకు హీరోల అభిమానుల మధ్య ఏ హీరోకు సోషల్ మీడియాలో ఎంత మంది అభిమానులు ఉన్నారన్నది కూడా పెద్ద చర్చనీయాంశంగాను, పోటీగాను మారింది. దీంతో స్టార్ హీరోలు సోషల్ మీడియా అక్కౌంట్లు కలిగి ఉండడంతో పాటు తమ సినిమాలతో పాటు ఇతర వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియాలో పంచుకోవాల్సి వస్తోంది.
ఇక టాలీవుడ్ స్టార్ హీరోలతో పాటు వారి భార్యలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీప్రణతి ఇప్పటి వరకు ఈ సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే ఆమె కూడా తాజాగా ఎంట్రీ ఇచ్చారు. ఇక ఎన్టీఆర్‌కు సోషల్ మీడియాలో తిరుగులేని క్రేజ్ ఉంది. ప్రస్తుతం మనోడు నటించిన త్రిబుల్ ఆర్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా ట్విట్టర్లోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ భార్య లక్ష్మీప్రణతి మొదటి పోస్ట్‌గా తన భర్త ఎన్టీఆర్‌తో కలిసి దిగిన ఫొటో షేర్ చేసింది. ఇప్పటి వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న లక్ష్మీ ప్రణతి ఇప్పుడు సడెన్‌గా ఎంట్రీ ఇవ్వడం ఆశ్చర్యంగా ఉంది. మీ అందరితో కలిసి ట్విట్టర్లో జాయిన్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది… మా మొదటి ట్వీట్ నా లవ్లీ భర్తతో కలిసి పోస్ట్ చేస్తున్నాను అని ఆమె ట్వీట్ చేయడంతో పాటు తన భర్త ఎన్టీఆర్‌ను ట్యాగ్ చేసింది. ప్రణతి అలా ట్విట్టర్లోకి ఎంట్రీ ఇచ్చిందో లేదో 24 గంటలలోనే 3 వేల మంది ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుంది.
Happy to join Twitter with You all! Posting my First tweet with my lovable husband @tarak9999 #NTR. pic.twitter.com/2vQNuuLVDJ
— Lakshmi Pranathi (@LakshmiNTR_) January 27, 2022