Moviesఎన్టీఆర్ భార్య ల‌క్ష్మీప్ర‌ణ‌తి లైఫ్ స్టైల్ ఇలా ఉంటుందా..!

ఎన్టీఆర్ భార్య ల‌క్ష్మీప్ర‌ణ‌తి లైఫ్ స్టైల్ ఇలా ఉంటుందా..!

ప్ర‌స్తుతం అంతా సోష‌ల్ మీడియా యుగం కావ‌డంతో సెల‌బ్రిటీల వ్య‌క్తిగ‌త విష‌యాలు తెలుసుకోవడానికి ప్ర‌తి ఒక్క‌రు ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నారు. తెర‌ముందు అంద‌రికి తెలిసిన విష‌యాల కంటే తెలియ‌ని విష‌యాలపై మ‌క్కువ పెంచుకుంటున్నారు. యంగ్‌టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు తెలుగు నాట ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. రెండు ద‌శాబ్దాల కెరీర్‌లో రోజు రోజుకు తిరుగులేని ఫాలోయింగ్‌తో ఎన్టీఆర్ దూసుకు పోతున్నాడు.

ఎన్టీఆర్ ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి ఎక్కువ విష‌యాలు బ‌య‌ట‌కు రావు. ఇటీవ‌ల మాత్ర‌మే సోష‌ల్ మీడియాలో కాస్త యాక్టివ్‌గా ఉంటూ వ‌స్తున్నాడు. ఎన్టీఆర్ భార్య ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి సోష‌ల్ మీడియాకు కూడా దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. ఆమె ఇటీవ‌లే ట్విట్ట‌ర్‌ల్లోకి వ‌చ్చారు. ఇక ప‌బ్లిక్ ఫోక‌స్‌కు దూరంగా పూర్తిగా ఫ్యామిలీ లైఫ్‌కే ప్ర‌యార్టీ ఇచ్చే ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి పూర్తిగా త‌న భ‌ర్త‌, పిల్ల‌లే ప్రాధాన్యంగా ఉంటూ వ‌స్తున్నారు.

ఆమె కోట్ల‌కు అధిప‌తి అయిన ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త నార్నే శ్రీనివాస‌రావుకు ఏకైక కుమార్తె. నార్నేకు ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. ఆమెకు క‌ట్నంగా క్యాష్ రూపంలోనే రు. 1000 కోట్లు వ‌చ్చాయ‌ని టాక్ ఉంది. 2011 మే 5న ల‌క్ష్మీప్ర‌ణ‌తి, ఎన్టీఆర్ వివాహం జ‌రిగింది. ఈ దంప‌తుల‌కు అభ‌య్‌రామ్‌, భార్గ‌వ్‌రామ్ అనే ఇద్ద‌రు కుమారులు ఉన్నారు. ఎన్టీఆర్‌కు మేన‌మామ అయిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు స్వ‌యంగా ఈ సంబంధం కుదిర్చారు.

చంద్ర‌బాబు మేన‌కోడ‌లి కుమార్తే ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి. చాలా గొప్పింటి కోడులు అయినా కూడా ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి చాలా మిత‌భాషి, మృదుస్వ‌భావి. భ‌ర్త ఎంత స్టార్ హీరో అయినా అస‌లు ఆ ఛాయ‌లు కూడా లేకుండా ఆమె ప‌ర్స‌న‌ల్ లైఫ్ ఉంటుంది. స్టార్ హీరోల భార్య‌లు సైతం సోష‌ల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ హంగులు, అర్భాటాల‌కు పోతూ ఉంటారు.

ఇప్ప‌టి వ‌ర‌కు ల‌క్ష్మీప్ర‌ణ‌తి సోష‌ల్ మీడియాలోకి కూడా ఎంట‌ర్ కాలేదంటూ ఆమె ఎంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారో తెలుస్తోంది. ఆమె త‌న భ‌ర్త‌, అత్త‌గారు, పిల్ల‌లతో మాత్ర‌మే ఎక్కువ టైం గ‌డిపేందుకు ఇష్ట‌ప‌డ‌తారు. ఆమె హైద‌రాబాద్‌లోనే ఉన్నా చాలా త‌క్కువుగా మాత్ర‌మే బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు ఇష్ట‌ప‌డ‌తారు.

ఆమె షాపింగ్ అంతా ఎక్కువుగా ముంబైలో జ‌రుగుతుంద‌ట‌. ఇక కొత్త సినిమాలు వ‌చ్చాయంటే త‌న ఇంట్లోనే ఉన్న థియేట‌ర్లో ఆమె ఫ్యామిలీతో క‌లిసి సినిమా చూసేందుకు ఇష్ట‌ప‌డ‌తారు. ఇక త‌న భ‌ర్త తార‌క్ ప్ర‌తి సినిమాను ఆమె ఫ్యామిలీతో క‌లిసి ముందే చూసేందుకు ఇష్ట‌ప‌డ‌తార‌ట‌. ఇక ఫ్యామిలీ ఫంక్ష‌న్లు, బంధువులు శుభ‌కార్యాలు, ఇత‌ర కార్య‌క్ర‌మాల‌కు ఎన్టీఆర్‌కు బ‌దులుగా ల‌క్ష్మీ త‌న అత్త షాలినీతో క‌లిసి ఎక్కువుగా అటెండ్ అవుతూ ఉంటారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news