దర్శకధీరుడు రాజమౌళి – ఎన్టీఆర్ కాంబినేషన్‌కు ఉన్న క్రేజే వేరు. వీరి కాంబోలో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చి సూపర్ డూపర్‌హిట్ అయ్యాయి. ఈ మూడు సినిమాలు ఎన్టీఆర్ కెరీర్‌ను సరైన టైంలో టర్న్ చేశాయి. ఇక వీరి కాంబోలో నాలుగో సినిమాగా త్రిపుల్ ఆర్ సినిమా తెరకెక్కింది. డీవీవీ ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అగ్ర నిర్మాత డీవీవీ దానయ్య రు. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ఎన్టీఆర్‌తో పాటు టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ కూడా నటించాడు.
మూడేళ్ల నుంచి ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తోన్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా 14 భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే ఒమిక్రాన్ ఎఫెక్ట్‌తో మరోసారి వాయిదా వేయక తప్పలేదు. ప్రస్తుతం త్రిబుల్ ఆర్‌ను రిలీజ్ చేసేందుకు రెండు డేట్లు పెట్టుకున్నా.. ఎప్పటకీ వస్తుందో .. ఇంకెన్నాళ్లు వెయిట్ చేయాలో తెలియక ప్రేక్షకులు అసహనం, ఆగ్రహంతోనే ఉంటున్నారు.
ప్రమోషన్లు అన్నీ పూర్తయ్యాక కూడా త్రిబుల్ ఆర్‌ను వాయిదా వేయడం ఎవ్వరికి నచ్చలేదు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీంగాను, రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగాను నటించారు. 1920 బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఫిక్షనల్ పీరియాడికల్ సినిమాగా త్రిబుల్ ఆర్ తెరకెక్కింది. ఈ సినిమా గురించి ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో ఓ ఇంట్రస్టింగ్ విషయం చెప్పారు. కొమరం భీంగా నటించిన ఎన్టీఆర్ తాను చరణ్ చేసిన అల్లూరి సీతారామరాజు పాత్ర చేయాల్సి వస్తే ఎలా ఉండేదో చెప్పాడు.
సీతారామరాజు ట్రైలర్ చూసినప్పుడు చరణ్ నిప్పుల మధ్యలో నుంచి దూకుతూ బాణం వేసే సీన్ చాలా బాగా వచ్చిందని… ఈ ఒక్క సన్నివేశంలో తాను నటిస్తే ఎంతో బాగుండేదని చరణ్ ఆ పాత్రపై తనకు ఉన్న ఇష్టాన్ని బయట పెట్టాడు. ఇక 1920ల్లో ఈ ఇద్దరు పోరాట యోధులు కలిసి బ్రిటీషర్లపై ఎలా పోరాటం చేశారో ? రాజమౌళి చూపించనున్నాడు.
“I Would Love to do that Scene of Complete Revealing of ALLURI SITA RAMARAJU. Not Just because of It’s BGM & the Way it placed in the trailer, I Know What that Scene means in the Movie” – @tarak9999@AlwaysRamCharan #RamCharan pic.twitter.com/mCs7rWkBDk
— ManofMassesNTR™ (@ManofMassesNTR) January 26, 2022