Moviesపెళ్లి వ‌ద్దు... లివింగ్ రిలేష‌న్ ముద్దు... శృతి షాకింగ్ కామెంట్స్‌..!

పెళ్లి వ‌ద్దు… లివింగ్ రిలేష‌న్ ముద్దు… శృతి షాకింగ్ కామెంట్స్‌..!

కోలీవుడ్ ముద్దుగుమ్మ శృతీహాస‌న్ ఇప్ప‌టికే మూడున్న‌ర ప‌దుల వ‌య‌స్సుకు చేరువు అయ్యింది. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న‌ప్పుడు ప్రియుళ్ల‌తో డేటింగ్‌లు, బాలీవుడ్ సినిమాలు అంటూ కెరీర్ నాశ‌నం చేసుకుంది. ఇప్పుడు ఆమె సినిమాల్లో చేయాల‌ని చూస్తున్నా చివ‌ర‌కు సీనియ‌ర్ హీరోలే ఆమెకు ఆప్ష‌న్ అవుతున్నారు. సీనియ‌ర్ హీరోల‌కు ఏ హీరోయిన్ దొర‌క్క చివ‌ర‌కు శృతిని ఫిక్స్ చేసుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చేసింది. తాజాగా ఆమె సీనియ‌ర్ హీరో బాల‌య్య ప‌క్క‌న మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే సినిమాలో న‌టిస్తోంది.

అలాగే యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ స‌లార్ సినిమాలో కూడా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం శంత‌ను హ‌జారిక‌తో డేటింగ్‌లో ఉన్న ఆమె ఈ విష‌యంపై ఓపెన్ అయిపోయారు. ప్ర‌స్తుతం శంత‌ను, శృతి ఇద్ద‌రు క‌లిసి ముంబైలో ఒకే ఇంట్లో ఉంటున్నారు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో శృతీహాస‌న్‌కు పెళ్లికి సంబంధించిన ప్ర‌శ్న ఎదురైంది. ఈ ప్ర‌శ్న‌కు శృతి బ‌దులిస్తూ త‌న ద‌గ్గ‌ర పెళ్లి ప్ర‌స్తావ‌నే తీసుకు రావొద్ద‌ని.. పెళ్లీ లేదు గిళ్లీ లేదని చెప్పింది.

శృతి పెళ్లంటే త‌న‌కు ఏ మాత్రం ఇష్టం లేద‌ని చెప్ప‌డంతో ఆమెకు లివింగ్ రిలేష‌న్‌లోనే సంతోషంగా ఉంద‌న్న విష‌యం క్లారిటీ వ‌చ్చేసింది. శంత‌ను హ‌జారిక‌కు ముందు కూడా ఆమె విదేశీ భాయ్‌ఫ్రెండ్ మైకేల్ కోర్స‌ల్‌తో స‌హ‌జీవ‌నం చేసింది. ఆమెతో ఆమె పెళ్లి పీట‌లు ఎక్కుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. క‌ట్ చేస్తే అత‌డితో బ్రేక‌ప్ చెప్పేసింది. ఇప్పుడు మ‌ళ్లీ శంత‌నుతో డేటింగ్ మొద‌లు పెట్టేసింది.

అయితే శృతీ కామెంట్ల‌పై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. శృతికి వివాహ వ్య‌వ‌స్థ‌పై అస్స‌లు న‌మ్మ‌కం లేక‌పోతే ? ఎలా ? ఇక ఎప్పుడూ డేటింగ్‌లు చేస్తూ కాలం గడిపేస్తుందా ? అని ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆమె ఒక్కో సినిమాకు రు. 2 కోట్ల రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేస్తోంది. అయితే సీనియ‌ర్ హీరోల‌కు ఆమే ఆప్ష‌న్ కావ‌డంతో ఆమె డిమాండ్ వ‌ర్క‌వుట్ అవుతున్న‌ట్టే క‌నిపిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news