Moviesఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఫ్యీజులు ఎరిగే న్యూస్‌... ఒకేసారి డ‌బుల్ ధ‌మాకా..!

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఫ్యీజులు ఎరిగే న్యూస్‌… ఒకేసారి డ‌బుల్ ధ‌మాకా..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ 2018 లో వచ్చిన అరవింద సమేత వీరార‌ఘ‌వ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. అప్పటి నుంచి ఎన్టీఆర్ నటించిన సినిమా ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు. గ‌త మూడు సంవత్సరాలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న త్రిబుల్ ఆర్ సినిమా కోసమే పూర్తిగా అంకితం అయిపోయాడు. 2021 లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడింది. సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా 14 భాషల్లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే అంతలోనే ఒమిక్రాన్‌ కరోనా వైరస్ మరోసారి పెరుగుతూ ఉండడంతో పాటు ఏపీలో ఉన్న టికెట్ రేట్ల ఈ నేపథ్యంలో సమ్మర్ కు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

దీంతో సంక్రాంతి అయినా ఎన్టీఆర్‌ను థియేటర్లలో చూస్తామని ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఇక త్రిబుల్ ఆర్ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో ? కూడా తెలియకుండానే దర్శకుడు కొరటాల శివ ఎన్టీఆర్ 30వ సినిమా మొదలు పెట్టబోతున్నారు. యువసుధా ఆర్ట్స్ – ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి. ఏకధాటిగా జరిగిన సింగిల్ షెడ్యూల్లో షూటింగ్ పూర్తిచేసి జూన్ నెలలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని కొరటాల శివ ప్లాన్ చేస్తున్నారు.

ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమా ఫిబ్రవరి 4న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు డబుల్ ధ‌మాకా ఏంటంటే ఉప్పెన‌ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టి తొలి సినిమాతోనే ఒక్కసారిగా అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న దర్శకుడు బుచ్చిబాబు సానా కూడా చాలా రోజులుగా ఎన్టీఆర్ డేట్స్‌ కోసం ఎదురు చూస్తున్నాడు.

ఇప్పటికే క‌థ కూడా ఫైన‌లైజ్ అయ్యింది. ఈ క‌థ‌కు ఎన్టీఆర్ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. కొర‌టాల శివ షూటింగ్ పూర్త‌యిన వెంట‌నే ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేసి.. ఈ యేడాది ద‌స‌రాకే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. అదే జ‌రిగితే ఈ యేడాది త్రిఫుల్ ఆర్‌తో పాటు కొర‌టాల సినిమా, బుచ్చిబాబు సినిమాలు కూడా రిలీజ్ అవుతాయి. ఇక 2022లో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు మామూలు పండ‌గ కాద‌నే చెప్పాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news