టాలీవుడ్లో 2002లో ఆర్యన్ రాజేష్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన సొంతం సినిమాతో హీరోయిన్గా పరిచయం అయ్యింది బొద్దుగుమ్మ నమిత. ఆమె తొలి సినిమా విక్టరీ వెంకటేష్‌తో చేసిన జెమినీ సినిమా. అయితే ఆ సినిమా కంటే సొంతం ముందుగా రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత ఆమె తెలుగులో బాలయ్య పక్కన సింహా లాంటి సినిమాల్లో చేసింది. తర్వాత మరీ లావెక్కిపోవడంతో ఆమెకు అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు. తర్వాత కోలీవుడ్‌తో పాటు అటు కన్నడం, మళయాళ సినిమాలు కూడా చేసింది.
ఆ తర్వాత నమిత తమిళ్ బిగ్‌బాస్ సీజన్ 1లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి బుల్లితెర ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైంది. ఈ బొద్దుగుమ్మ పలు టీవీ షోలకు జడ్జ్‌గా కూడా వ్యవహరించింది. భారీ ఖాయంతో ఉండే నమిత బొద్దుగా ఉన్నా ఆమెకు ఇప్పటకీ పలు భాషల్లో ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. ఇక నమిత ఆంధ్రా కుర్రాడు అయిన వీరేంద్ చౌదరిని 2017లో ప్రేమ వివాహం చేసుకుంది. చెన్నైలో ఎంచక్కా ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది.
నమితపై పెళ్లికి ముందే రూమర్లు వచ్చాయి. పెళ్లయ్యాక కూడా ఆమెను ఈ రూమర్లు వదల్లేదు. సీనియర్ నటుడు శరత్‌బాబుతో ఆమె డేటింగ్లో ఉందన్న వార్తలు కోలీవుడ్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వార్తలపై తన తాజా ఇంటర్వ్యూలో ఆమె భర్త వీరేంద్ర చౌదరి స్పందించారు. మనకు ఏది నిజమో తెలియనప్పుడు ఈ పుకార్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పాడు.
ఈ రూమర్లను మనం విని నవ్వుకోవడం తప్పా వాటి గురించి లోతుగా ఆలోచించాల్సిన పని లేదని వీరేంద్ర చెప్పాడు. ఇక పెళ్లియనప్పటి నుంచి నమిత తనతోనే ఉంటోందని.. తానేంటో ఆమెకు.. ఆమేంటో తనకు తెలుసని వీరేంద్ర చెప్పాడు. ఇక తనపై ఎన్ని రూమర్లు వచ్చినా కూడా నమిత పట్టించుకోదు అని.. అసలు మేం పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడే శరత్‌బాబుతో నమిత పెళ్లని ప్రచారం చేశారు.. అసలు శరత్‌బాబు ఎవరో మాకు తెలియదని వీరేంద్ర ఘాటుగా రూమర్లను స్ప్రెడ్ చేసేవాళ్లకు కౌంటర్లు ఇచ్చాడు.