టాలీవుడ్‌లో సీనియర్ హీరోలుగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్‌బాబుది నాలుగు దశాబ్దాల అనుబంధం. ఇద్దరూ ఒకే టైంలో ఇండస్ట్రీలోకి వచ్చారు. చిరంజీవి కెరీర్ ఆరంభంలో ఒకటి రెండు సినిమాల్లో మాత్రమే విలన్ వేషాలు వేశారు. ఆ తర్వాత చిరంజీవి హీరోగా ఎంట్రీ ఇచ్చి దూసుకుపోయాడు. ఈ క్రమంలోనే ఏకంగా 150 సినిమాలు చేసేశారు. తన కెరీర్‌లోనే 150వ సినిమాగా వచ్చిన ఖైదీనెంబర్ 150 సినిమాలో నటించారు. ఆ తర్వాత సైరా సినిమా చేసిన చిరు ఇప్పుడు ఆచార్య.. ఇక వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు.
ఇటు మోహన్‌బాబు కూడా విలన్‌గా, హీరోగా, నిర్మాతగా నాలుగు దశాబ్దాలుగా తన ప్రస్థానం కొనసాగిస్తున్నారు. వీరిద్దరిది టామ్ & జెర్రీ బంధం. ఎప్పటికప్పుడు కాస్త విసుర్లు విసురుకుంటూ ఉంటారు. తర్వాత ఎంతో అప్యాయంగా ఉంటూ ఉంటారు. మోహన్‌బాబే కాస్త స్పీడ్‌గా మాటలు విసురుతూ ఉంటారు. తర్వాత చిరంజీవి తన బెస్ట్ ఫ్రెండ్ అని చెపుతారు.. ఇటీవల జరిగిన మా ఎన్నికలకు ముందు వరకు వీరు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. మా ఎన్నికల సమయంలో వీరి మధ్య గ్యాప్ వచ్చినట్టు మోహన్‌బాబు వ్యాఖ్యలే చెప్పాయి.
ఇదిలా ఉంటే మంచు లక్ష్మి గతంలో హోస్ట్ చేసిన ఓ కార్యక్రమంలో ర్యాపిడ్ రౌండ్ ప్రశ్నల్లో భాగంగా లక్ష్మి నాగార్జున, మోహన్‌బాబు ఎవరంటే ఇష్టం అని చిరును ఇరుకున పెట్టే ప్రశ్న వేసింది. దీంతో చిరంజీవి ఠక్కున మోహన్‌బాబు పేరు చెప్పేశారు. ఇక్కడ మోహన్‌బాబు పేరు ఎందుకు చెప్పాను అనేందుకు క్లారిటీ కూడా ఇచ్చారు. మోహన్‌బాబు పేరు చెప్పకపోతే ఇప్పుడు చాలా గొడవలు అయిపోతాయని… అందుకే మోహన్‌బాబు పేరు చెప్పానని చిన్న చమక్కు ఇచ్చారు.