టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. 2020 సంక్రాంతి కానుకగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. వరుస హిట్లతో జోరుమీద ఉన్న మహేష్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ తన కెరీర్లో ఎంతో మంది స్టార్ దర్శకులతో కలిసి పని చేశారు.
కొంత మంది డైరెక్టర్లు మనోడికి సూపర్ డూపర్ హిట్లు ఇచ్చారు. కొంతమంది డిజాస్టర్ సినిమాలు కూడా తీశారు. మహేష్ గుణశేఖర్ – సుకుమార్ – అనిల్ రావిపూడి – కొరటాల శివ – త్రివిక్రమ్ శ్రీనివాస్ – వంశీ పైడిపల్లి – రాఘవేంద్ర రావు – బి.గోపాల్ – జయంత్ – కృష్ణవంశీ – పూరి జగన్నాథ్ – శ్రీను వైట్ల లాంటి డైరెక్టర్లతో కలిసి పని చేశాడు. వీరిలో చాలా మంది దర్శకులకు మహేష్ భవిష్యత్తులోనూ మరోసారి అవకాశం ఇవ్వవచ్చు. అయితే ఇద్దరు దర్శకులకు మాత్రం మహేష్ ఎప్పటికీ మరో ఛాన్స్ ఇవ్వడు అన్న టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో ఎప్పటినుంచో ఉంది. ఆ ఇద్దరు దర్శకులు ఎవరో కాదు ఒకరు శ్రీకాంత్ అడ్డాల.. మరొకరు వి.వి.వినాయక్.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సూపర్ హిట్ ఇచ్చాడన్న నమ్మకంతో మహేష్ బాబు శ్రీకాంత్ కు బ్రహ్మోత్సవం సినిమాతో మరోసారి అవకాశం ఇచ్చారు. శ్రీమంతుడు సినిమా షూటింగ్ క్లైమాక్స్ లో ఉండగా శ్రీకాంత్ అడ్డాల మహేష్ కలిసి ఫ్యామిలీ స్టొరీ అని చెప్పడంతో మహేష్ కథ పూర్తిగా వినకుండా శ్రీకాంత్ పై నమ్మకంతో వెంటనే ఓకే చెప్పేశాడట. అయితే ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యాక కానీ మహేష్ కు ఇంకా పూర్తి కథ రెడీ కాలేదన్న విషయం తెలిసిందట.
అసలు శ్రీకాంత్ అడ్డాల ఏ సీను ఎలా తీస్తున్నాడో కూడా అర్థం కాని గందరగోళ పరిస్థితి నెలకొంది. మహేష్ ఆరా తీస్తే అప్పుడు స్క్రిఫ్ట్ రెడీ కాలేదన్న విషయం తెలిసిందట. దీంతో నెల రోజుల పాటు షూటింగ్ ఆపేసి పూర్తి కథ రెడీ చేయమని శ్రీకాంత్‌పై కేకలు వేశాడట. చివరకు ఆ సినిమా ఎలాగో ఫ్లాప్ అవుతుందని తెలిసి మహేష్ అయిష్టంగా చేశాడట. చివరకు బ్రహ్మోత్సవం డిజాస్టర్ అయ్యింది.
ఇక మరోసారి మహేష్ శ్రీకాంత్ అడ్డాలను నమ్మడన్న టాక్ ఇండస్ట్రీలో బలంగా వచ్చేసింది.
ఇక వివి వినాయక్ వరుస హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్నప్పుడే ఆయన చెప్పిన కథ మహేష్ బాబుకు నచ్చలేదట. అప్పుడు వినాయక్ ఎన్టీఆర్ – బాలయ్య – చిరంజీవి – బన్నీ లాంటి హీరోలకు వరుస హిట్లు ఇచ్చే ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. అలాంటి సమయంలో వినాయక్‌ని మహేష్ ఒకటి, రెండుసార్లు తప్పించుకోవడంతో వినాయక్ నా కథ నచ్చకపోవడం ఏంటని ఇండస్ట్రీలో కొందరు వ్యక్తుల దగ్గర అసహనం వ్యక్తం చేశాడట.
అది మహేష్‌కు తెలిసింది. ఆ తర్వాత వినాయక్‌కు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఇక ఇప్పుడు వినాయక్ వరుస ఫ్లాపులతో అసలు రేసులో లేకుండా పోయాడు. ఇక ఇప్పుడు మహేష్ – వినాయక్‌కు అపాయింట్మెంట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు.