Moviesచైతన్య ముందే సమంత గురించి అలా..దెబ్బకు నాగార్జున నీళ్లు తాగేశాడు..కృతికి ధైర్యం...

చైతన్య ముందే సమంత గురించి అలా..దెబ్బకు నాగార్జున నీళ్లు తాగేశాడు..కృతికి ధైర్యం ఎక్కువే.. ?

అభిమానులు ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూసిన ఆర్ ఆర్ ఆర్, రాధే శ్యాం సినిమాలు కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడ్డాయి. దీంతో కొన్ని మీడియం రేంజ్ సినిమాలకి బాక్సాఫీస్ వద్ద ఖాళీ దొరికింది. ఇక పెద్ద సినిమాల ఎఫెక్ట్ తో సంక్రాంతి కి రావాలా వద్దా అని డైలమాలో ఉన్న నాగారజున హీరో గా నటించిన “బంగార్రాజు” సినిమా కి ఇప్పుడు ఆటంకాలు అన్ని క్లియర్ అయిపోయాయి. సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో బంగార్రాజుగా నాగార్జున ఎంత సందడి చేశాడో అందరికీ తెలిసిందే. సంక్రాంతి సీజన్‌లో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపేసింది.

ఇక ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా రాబోతన్న బంగార్రాజు సినిమా కూడా సంక్రాంతి బరిలోకి దిగింది. నాగార్జున, నాగ చైతన్య కాంబినేషన్‌లో రాబోతోన్న బంగార్రాజు సినిమా సంక్రాంతికి రాబోతోంది. జనవరి 14న బంగార్రాజు రాబోతోన్నట్టు ప్రకటించారు. పెద్ద పండక్కి ధియేటర్లో పెద్ద హీరోల సందడి లేదనుకుంటున్న వాళ్లకి.. సోగ్గాళ్లు సంక్రాంతికి వస్తున్నారంటూ అనౌన్స్ చేశారు. సంక్రాంతికి కంప్లీట్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న బంగార్రాజు.. బ్యాక్ టూ బ్యాక్ ఇంట్రస్టింగ్ వీడియోలతో సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ పెంచేస్తున్నారు.

బంగార్రాజు సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానున్న నేపథ్యంలో మూవీ టీం ప్రమోషన్స్‌ జోరు పెంచింది. ఇందులో భాగంగా తమను ప్రైవేట్‌ జెట్‌ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారి నాగార్జున,నాగ చైతన్య, కృతి శెట్టి. ఈ క్రమంలోనే యాంకర్ వాళ్ల సినిమాకి సంబంధించినవి..అలాగే పరసనల్ విషయాలు అడిగి తెలుసుకుంది. ఈ క్రమంలో కృతిని నాగచైతన్య నటించిన సినిమాల్లో మీకు ఫేవరెట్ మూవి ఏది అని అడగ్గా..మజిలీ మూవీ అంటూ ఆ సినిమా గురించి కొంచెం సేపు మాట్లాడుతుంది. ఇక కృతి నోట మజిలీ సినిమా అని రాగానే చైతన్య ఫేస్ ఎక్స్ ప్రేషన్స్ మార్చేశాడు. నాగార్జున అయితే వెంటనె పక్కనే ఉన్న వాటర్ బాటిల్ అందుకుని నీళ్లు తాగేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news