తెలుగు సినిమా పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన ఎంతో మంది స్టార్లకు పుత్రశోకం తప్పలేదు. సహజంగా పుత్రుడు అనేవాడు పున్నామ నరకాన్ని తప్పిస్తాడని అంటారు. అంటే తండ్రి చనిపోయాక కొరివి పెట్టి తండ్రికి పున్నామ నరకం తప్పిస్తాడని పురాణాలు చెపుతుంటాయి. అయితే తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతో మంది స్టార్లు పుత్రశోకం భారీ నుంచి తప్పించుకోలేకపోయారు. ఈ లిస్టులో సీనియర్ ఎన్టీఆర్‌తో మొదలు పెడితే తాజాగా సూపర్‌స్టార్ కృష్ణ వరకు ఎంతో మంది ఉన్నారు. ఈ లిస్టులో ఎవరెవరు ఉన్నారో చూద్దాం.
నందమూరి ఫ్యామిలీలో సీనియర్ ఎన్టీఆర్‌కు పుత్రశోకం కలిగింది. ఆయన పెద్ద కుమారుడు రామకృష్ణ అనారోగ్యంతో మృతిచెందారు. ఈ బాధ నుంచి బయట పడేందుకు ఎన్టీఆర్‌కు చాలా టైం పట్టింది. అలాగే ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు జానకీరామ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆయన విలవిల్లాడిపోయారు. ఆ దిగులుతోనే ఆయన చాలా రోజులు కోలుకోలేకపోయారు.
సీనియర్ రైటర్స్‌లో ఒకరు అయిన పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు రఘుబాబు అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన తన కుమారుడి పేరు మీద ఇప్పటకి గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం తలకోనలో నాటకోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు కుమారుడు కోట ప్రసాద్ 2010లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కుమారుడి మరణం నుంచి కోలుకునేందుకు కోటకు చాలా రోజులు పట్టింది.
ఇక మరో కమెడియన్ బాబూమోహన్ కుమారుడు పవన్ కుమార్ కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విధి ఎంత విచిత్రమైంది అంటే.. ఎన్నో ఏళ్లుగా విలక్షణమైన పాత్రల్లో మెప్పించి మంచి స్నేహితులుగా ఉన్న కోట, బాబూమోహన్ ఇద్దరు కుమారులు రోడ్డు ప్రమాదాల్లోనే మృతి చెందారు. ఇక మరో సీనియర్ నటుడు గొల్లపూడి మారుతిరావు కుమారుడు శ్రీనివాస్ 1992 ఆగస్టు 12న ప్రమాదవశాత్తు షూటింగ్‌లో మృతిచెందాడు.
దర్శకుడు తేజ కుమారుడు ఆరేళ్ల వయస్సులో అనారోగ్యంతో మృతి చెందారు. తేజ ఈ విషాదం నుంచి కోలుకునేందుకు చాలా రోజులు పట్టింది. ప్రభుదేవా కొడుకు కూడా గాలిపటం ఎగరవేస్తూ ప్రమదవశాత్తు మృతిచెందాడు. ఇదే చివరకు ప్రకాష్‌రాజ్ తన మొదటి భార్య లలితకుమారికి విడాకులు ఇవ్వడానికి కారణమైంది. డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవా తనయుడు చిన్న వయస్సులోనే మృతి చెందాడు. ఆ తర్వాత తన భార్య రమలత్‌తో మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకున్నారు.