రష్మి గౌతమ్.. ఇప్పుడు ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడేమో..? సినిమాల్లో కూడా ఈ భామ పేరును వాడేస్తున్నారు. అంతగా క్రేజ్ తెచ్చుకుంది ఈమె. బుల్లితెర యాంకర్ గా… జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయ్యి లక్షలాదిమంది అభిమానులను సంపాదించుకున్న రష్మి గౌతమ్.. ఒకప్పుడు హీరోయిన్గా కూడా తన పెర్ఫామెన్స్ చూపిస్తూ వచ్చింది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ .. ఎప్పటికప్పుడు తన షోల వివారాలతో పాటు గ్లామరెస్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కాకరేపుతోంది.
బుల్లితెరపై వివిధ కార్యక్రమాల్లో తనదైన స్టైల్లో యాంకరింగ్ చేసి అతికొద్ది కాలంలోనే భారీ పాపులారిటీ తెచ్చుకుంది రష్మీ. అంతే కాదు…ముఖ్యంగా చిట్టి పొట్టి డ్రెస్ లతో హాట్ హాట్ అందాలను ప్రదర్శిస్తూ… ఎప్పుడు ట్రేడింగ్ లో ఉంటుంది. అమ్మడు జబర్దస్త్ కమెడియన్ సుధీర్ తో చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఇక వీళ్ళ మధ్య కెమిస్ట్రీ చూస్తే నిజంగానే లవ్ లో ఉన్నారు ఏమో ఈ జంట అనిపించక తప్పదు. ఇక దీంతో ఎప్పతికప్పుడు వీళ్ల మధ్య ఎఫైర్ ఉందంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. మా మాధ్య అలాంటిది ఏం లేదురా బాబోయ్ అంటున్నా కానీ జనాలు వినడంలేదు. దీంతో ఆ రూమర్లు పై స్పందించడమే మానేసారు రష్మి సుధీర్.
ఇక రీసెంట్ గా రష్మికి పెళ్లైంది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. రష్మీ గౌతమ్ లాక్ డౌన్ లో రహస్యంగా పెళ్లి చేసుకుందట. తాజా సమాచారం ప్రకారం రష్మి ఇప్పుడు ఇండస్ట్రీలో ఏ మాత్రం సంబంధం లేని ఒక వ్యక్తిని రహస్యంగా పెళ్లి చేసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ తన పెళ్లి వార్తను ఎందుకు అధికారికంగా ప్రకటించడం లేదు అని అభిమానులు ఆలోచిస్తున్నారు. అయితే ఆ విషయాన్ని ఆమె ఎందుకు సీక్రెట్ గా ఉంచుతుందనే విషయం మాత్రం తెలియడం లేదు.లాక్ డౌన్ లో చాలా మంది తారలు పెళ్లిళ్లు చేసుకున్నారు.
ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చెప్పారు. కానీ రష్మీ మాత్రం తన పెళ్లి విషయాన్ని బయటపెట్టాలనుకోవడం లేదు. కొందరు ఏమో ఒక్కవేళ పెళ్లి అయిపోయింది అంటే అవకాశాలు రావు ఏమో అని భయపడి ఇలా తన పెళ్ళి విషయాని దాచి ఉంచింది ఏమో అంటున్నారు. మరి తన భర్తను రష్మి ఎప్పుడు పరిచయం చేస్తుందో చూడాలి.