బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన పని లేదు. తన అందంతో నటనతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హాట్ బ్యూటి. ఎప్పుడు సరదాగా ఉంటూ అందరిని నవ్విస్తూ చలాకీగా ఉండే ఈ అమ్మడు ‘కేదరినాథ్’తో హీరోయిన్గా తెరంగ్రేటం చేసింది. ఇక ఆ తరువాత సారా బ్రేక్ లేకుండా వరుస సినిమాలకు సైన్ చేసుకుంటూపోతూ టాప్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోయింది. ఈ క్రమంలోనే సారా ‘లవ్ ఆజ్కల్’, ‘కూలీ నం 1’లో నటించి తన నటనతో అభిమానులను ఆకట్టుకుంది.
ఇక అంతేకాదు ఇటీవల విడుదలైన ‘ఆత్రంగి రే’ సినిమాలో అక్షయ్ కుమార్..ధనుష్ తో కలిసి నటించి మరో బ్లాక్ బస్ట్ర్ విజయం తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో అమ్మడు నటన చాలా మందికి నచ్చింది. ఇక ఈ సినిమాలో తన నటనకు విమర్శకుల నుండి కూడా ప్రశంసలు దక్కాయి అంటేనే సారా నటన ఏ రేంజ్ లో ఆకట్టుకుంది మనం అర్ధం చేసుకోవచ్చు.
ఇక సోషల్ మీడియాలో యమ యాక్టివ్గా ఉండే సారా కి వాళ్ల అమ్మగారు అంటే చాలా ఇష్టమని ప్రతి ఇంటర్వ్యుల్లో చెప్తూనే ఉంటుంది. తన తల్లిదండ్రులు సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్ ఇద్దరికీ చాలా సన్నిహితంగా ఉండే ఈ అమ్మడు కి రీసెంట్ ఇంటర్య్వ్యుల్లో మీకు కాబోయే భర్త ఎలా ఉండాలి అనే ప్రశ్న ఎదూరినప్పుడు..సారా చెప్పిన జవాబు చాలా షాకింగ్ గా అనిపించింది.
తనకు కాబోయే భర్త..తన తల్లిని కూడా చూసుకోవాలి అని చెప్తూనే ఆమె తన తల్లిని విడిచి ఎక్కడకు పోను అని సారా కి ఇల్లరికం వచ్చే అబ్బాయే కావాలని చెప్పకనే చెప్పింది. వాళ్ల అమ్మ లేకుండా అస్సలు ఉండలేన్నై చెప్పిన సారా.. పెళ్లి చేసుకుంటే వాళ్ల అమ్మతో కలిసి జీవించగలిగే వ్యక్తినే వివాహం చేసుకుంటాను అని.. ఆమె ఎప్పటికీ వాళ్ళ అమ్మను విడిచిపెట్టను అని.. ఇల్లరికాన్ని ఒప్పుకునే వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను” అని సారా స్ట్రాంగ్ గా తెలిపింది.