పూజా హెగ్డే.. పరిచయం అవసరం లేని పేరు ఇది. నట సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన `ఒక లైలా కోసం` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన పూజా హెగ్డే.. కెరీర్ మొదట్లో వరుస ఫ్లాపులను ఖాతాలో వేసుకుని ఐరన్ లెగ్ అనే అపవాదను మూటగట్టుకుంది. అయితే పూజా హెగ్డే కెరీర్‌కి టర్నింగ్ పాయింట్ `దువ్వాడ జగన్నాథం(డీజే)`.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రమిది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. 2017 సమ్మర్‌లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టి.. పూజా హెగ్డేను హిట్ ట్రాక్ ఎక్కించింది.
ఈ సినిమా తర్వాతే పూజా మరిన్ని అవకాశాలు అందుకుని స్టార్ స్టేటస్‌ను దక్కించుకుంది. అయితే వాస్తవానికి దువ్వాడ జగన్నాథంలో హీరోయిన్‌గా మొదట పూజా హెగ్డేను అనుకోలేదట. డైరెక్టర్ హరీష్ శంకర్ బన్నీకి జోడీగా శ్రుతి హాసన్ బాగా సెట్ అవుతుందని భావించి.. ఆమెను స్పందించాడట. కానీ, పలు కారణాల వల్ల శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించేందుకు నో చెప్పింది. ఒకవేళ శ్రుతి నో చెప్పకుండా ఈ సినిమా చేసుంటే.. పూజా హెగ్డేకి పడిన హిట్ ఆమె ఖాతాలో పడేది.
దాంతో పూజా కెరీర్ పాతాళానికి పడటం ఖాయం అయ్యేది. మొత్తానికి శ్రుతి హాసన్ డీజే సినిమాను రిజెక్ట్ చేసి.. పరోక్షంగా పూజా హెగ్డే కెరీర్‌కు ప్లస్ అయ్యేలా చేసిందని చెప్పొచ్చు. కాగా, పూజా హెగ్డే సినిమాల విషయానికి వస్తే.. ఈమె నటించిన రాధేశ్యామ్, ఆచార్య చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అలాగే తమిళంలో విజయ్ దళపతితో `బీస్ట్` అనే సినిమా చేస్తోంది. హిందీలోనూ ఈ బ్యూటీ పలు సినిమాలకు సైన్ చేసింది.