Moviesత‌మ‌న్నా ల‌వ్‌లో ఇన్ని సార్లు ఫెయిల్ అయ్యిందా...!

త‌మ‌న్నా ల‌వ్‌లో ఇన్ని సార్లు ఫెయిల్ అయ్యిందా…!

మిల్కీ బ్యూటీ తమన్నా మూడున్నర పదుల వయస్సుకు చేరువైనా ఇప్పటికీ పెళ్లి అన్న మాట అనడం లేదు. ఇంకా చెప్పాలంటే స్టార్ హీరోలకు… సీనియర్ హీరోలకు ఇప్పుడు తమన్నా మంచి ఆప్షన్ గా మారిపోయింది. చిరంజీవి – వెంకటేష్ లాంటి హీరోలకు ఇప్పుడు హీరోయిన్లు దొరకడం లేదు. ఇలాంటి హీరోల కన్ను ఇప్పుడు తమన్నా మీద పడుతోంది. వెంకటేష్ ఇప్పటికే ఎఫ్2 సినిమాలో తమన్నాతో కలిసి నటించాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి పక్కన కూడా ఒక సినిమాలో తమన్నా ఛాన్స్ కొట్టేసింది. చిరంజీవి పక్కన నటించేందుకు కుర్ర హీరోయిన్లు… ముదురు హీరోయిన్లు కూడా ఇష్టపడటం లేదు. ఇలాంటి టైమ్ లో తమన్నాకు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేయడంతో ఆమె భారీ రెమ్యునరేషన్ కోసమే నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్.

అప్పుడెప్పుడో తమన్నా దశరథ్ దర్శకత్వంలో మంచు హీరో మనోజ్ కుమార్ నటించిన శ్రీ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ సినిమా హిట్ అవ్వడంతో ఆ తర్వాత తమన్నా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ ఆమె నటించింది. కెరీర్లో సక్సెస్ అవుతున్న తమన్నా ప్రేమలో మాత్రం వరుసగా విఫలమవుతూ వస్తుందట. ఒకటి కాదు రెండు కాదు తమన్నా మూడు సార్లు ప్రేమలో విఫలం అయిందట.

ఆమె చదువుకునే రోజుల్లోనే తన చిన్ననాటి స్నేహితుడుతో తొలిసారిగా ప్రేమలో పడిందట. తమన్నా అతడికి తన ప్రేమను వ్యక్త పరచక‌ ఉందే అతడు సిస్టర్ అని పిలవడంతో ఆ ప్రేమ బ్రేక్ అప్ అయిపోయిందట. తర్వాత సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదుగుతున్నప్పుడు కోలీవుడ్ హీరో కార్తీ తో ఆమె ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చాయి. వీరిద్దరూ కలిసి నటించిన ఆవారా సినిమా సూపర్ హిట్ అయ్యింది. అయితే కార్తి తండ్రి వీరి ప్రేమకు బ్రేక్ వేయడంతో పాటు… కార్తీకి మరో అమ్మాయితో పెళ్లి చేయడంతో తమన్నా రెండో సారి కూడా ప్రేమలో ఫెయిల్ అయింది.

కార్తీతో బ్రేకప్ జరిగాక కొద్దిరోజులు తమన్నా సైలెంట్ గా ఉంది. ఆ తర్వాత భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో ఒక వాణిజ్య ప్రకటనలో నటిస్తున్న సమయంలో ఏర్పడిన పరిచయం తర్వాత వీరిద్దరూ కలిసి డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాము ఓ వాణిజ్య ప్రకటన కోసమే కలిశామే తప్ప తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని సంకేతాలు ఇచ్చారు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మను పెళ్లి చేసుకుని లైఫ్ ఎంజాయ్ చేస్తుంటే… తమన్నా మాత్రం ఇప్పటికీ ఒంటరిగానే మిగిలిపోయింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news