అంజలి.. అచ్చ తెలుగు అందం… ఎక్కడో తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని మామిడికుదురు మండలం మొగలికుదురులో పుట్టింది. అక్కడ నుంచి ఆమె ఇప్పుడు తెలుగు, తమిళ్‌లో పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోవడంతో పాటు సీనియర్ హీరోలు బాలయ్య, వెంకటేష్ పక్కన కూడా నటించింది. పదో తరగతి వరకు స్వగ్రామంలోనే చదువుకున్న అంజలి.. ఆ తర్వాత చెన్నైకు మకాం మార్చేసింది. ఆమె సెప్టెంబర్ 11, 1986లో పుట్టింది. అంజలిని సినిమాల్లో చూస్తుంటే మన పక్కింటి అమ్మాయిగా కనిపిస్తూ ఉంటుంది.
జర్నీ, డిక్టేటర్, సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమాల్లో ఆమె హీరోయిన్‌గా నటించి మెప్పించింది. అటు అమాయకంగా కనిపించడంతో పాటు తన చలాకీ నటనతో ఆమె ప్రేక్షకుల్ని మెప్పిస్తోంది. పవన్‌కళ్యాణ్ వకీల్‌సాబ్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించే ఛాన్స్ కొట్టేసింది. అంజలి అసలు పేరు బాలి త్రిపుర సుందరి.. అయితే సినిమాల్లోకి వచ్చాక ఆమె అంజలిగానే అందరికి పాపులర్ అయ్యింది.
గ్రాడ్యుయేషన్ తర్వాత 2006లో ఫొటో మూవీతో ఆమె ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఆమె సింగం 2, బలుపు, శంకరాభరణం, సరైనోడు లాంటి సినిమాల్లో నటించింది. ఇక అంజలి సినిమాల్లోకి రాకముందు ఆమె సంపాదన ఏం లేదు. సినిమాల్లోకి వచ్చాక ఆమె ఆస్తులు బాగానే కూడపెట్టింది. అటు చెన్నైతో పాటు ఇటు హైదరాబాద్లో ఆమె ఆస్తుల విలువ రు. 10 కోట్లకు పైనే ఉంటుందట.
ఆమె ఆస్తుల వివాదంలో కుటుంబ సభ్యులతో కూడా గొడవ పడి వార్తల్లోకి ఎక్కిన సందర్భాలు ఉన్నాయి. కొందరు బంధువులే తన ఆస్తులు లాగేసుకునేందుకు ప్రయత్నించారని ఆమె ఆరోపించింది. అంజలికి సూపర్‌స్టార్ రజనీకాంత్, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ఇష్టమైన హీరోలు కాగా.. సావిత్రి, శ్రీదేవి ఆమె అభిమాన తారలు. అంజలి ఒక్కో సినిమాకు రు. 80 లక్షలు.. ఒక్కోసారి అంతకన్నా తక్కువ రెమ్యునరేషనే అందుకుంటోంది.
అంజలి పదేళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా ఎందుకో గాని.. మరీ పెద్ద రేంజ్ హీరోయిన్ అయితే కాలేకపోయింది. లేకపోతే ఆమె ఆస్తుల విలువల మరింత ఎక్కువే ఉండేది.