తెలుగు సినీ పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుడు రాజమౌళి.. ఈ విషయంలో ఎవ్వరికి ఎలాంటి డౌట్లు అక్కర్లేదు. అయితే ఇటీవల ఎందుకో కాని రాజమౌళి సోషల్ మీడియాలోనూ, బయటా నెగిటివిటీ ఎదుర్కొంటున్నాడు. ఆయన కావాలని చేయకపోయినా కొన్ని విషయాలు, పరిస్థితులు ఆయన్ను కొందరికి టార్గెట్ చేసేశాయి. ఆయన దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమాను పదే పదే వాయిదాలు వేస్తూ వచ్చారు. సంక్రాంతికి సర్కారువారిపాట, భీమ్లానాయక్ ముందే ఖర్చీఫ్‌లు వేసినా.. ఆ సినిమా యూనిట్లతో సంబంధం లేకుండానే త్రిబుల్ ఆర్ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసేశారు.
త్రిబుల్ ఆర్తో పోటీ ఎందుకని తమ సినిమాలను వాయిదా వేసుకున్నారు పై సినిమాల నిర్మాతలు. ఇప్పుడు సంక్రాంతి నుంచి మరోసారి త్రిబుల్ ఆర్‌ను వాయిదా వేశారు. దీంతో ఇప్పుడు మళ్లీ పెద్ద సినిమాలను ఎప్పుడు రిలీజ్ చేయాలో తెలియక తర్జన భర్జనలు పడుతున్నారు. మరోసారి సర్కారువారి పాట, భీమ్లానాయక్ సినిమాలతో పాటు పెద్ద సినిమాలను వాయిదా వేయక తప్పని పరిస్థితులు ఉన్నాయి.
భీమ్లానాయక్ నిర్మాతలు ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతికే తమ సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే రాజమౌళి ఎవ్వరితోనూ చర్చించకుండా తమ సినిమాను సంక్రాంతికి రిలీజ్ అన్నారు. ఇప్పుడు వాయిదా వేశారు. దీంతో పవన్ సినిమా మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది. ఇక పవన్ అభిమానులు నెల రోజులుగా రాజమౌళిని సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో టార్గెట్ చేస్తూ వస్తున్నారు.
ఇక న్యూట్రల్ సినీ అభిమానుల్లో కూడా రాజమౌళి ఎవరికి చెప్పా పెట్టకుండా త్రిబుల్ రిలీజ్ డేట్లు వేస్తూ ఉండడంతో కాస్త నెగిటివిటి అయితే పెరిగింది. ఆయన తన సినిమా సేఫ్‌గా ఉండాలని.. తన నిర్మాతకు నాలుగు డబ్బులు మిగలాలని కోరుకోవడంలో తప్పులేదు. అందుకు మిగిలిన సినిమాల నిర్మాతలు, ఆ సినిమా రిలీజ్ డేట్లతో సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తుండడమే కొందరికి ఇబ్బందిగా మారింది. ఇక భీమ్లా నాయక్ సంక్రాంతికి రిలీజ్ కాకపోవడంతో పవన్ ఫ్యాన్స్ ట్రోలింగ్‌కు గురవుతున్నాడు.
గతంలో రాజమౌళి ఏ పోస్ట్ పెట్టినా పాజిటివ్‌గా స్పందన ఉండేది. అయితే ఇప్పుడు ఓ క్యాన్సర్ బాధితురాలి సహాయార్థం ఫండ్ రైజింగ్ పోస్టు పెట్టాడు. బాహుబలి సినిమా కోసం కో ఆర్డినేటర్‌గా కీలకంగా ఉన్న దేవిక అనే అమ్మాయి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. తన కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ కోసం పనిచేసిన అమ్మాయికి రాజమౌళి సొంతంగా సాయం చేయొచ్చు కదా ? దీనికి ఫండ్ రైజింగ్ దేనికి అంటూ సోషల్ మీడియాలో చర్చలు స్టార్ట్ అయ్యాయి.
రాజమౌళి గతంలో ఏ చిన్న సినిమాను ప్రమోట్ చేస్తూ పోస్ట్ పెట్టినా కూడా ఆయన్ను అభినందిస్తూ మెసేజ్‌లు వచ్చేవి. అయితే ఇటీవల కాలంలో నెగిటివ్ కామెంట్లు కూడా కనిపిస్తున్నాయి.