సీనియర్ నటుడు తొట్టెంపూడి వేణు ఇరవై ఏళ్ల క్రితం టాలీవుడ్‌లో ఒక వెలుగు వెలిగారు. కె. విజయ్‌భాస్కర్ దర్శకత్వంలో లయ హీరోయిన్‌గా వచ్చిన స్వయంవరం సినిమాతో హీరోగా పరిచయం అయ్యి తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత వేణు వెనక్కు తిరిగి చూసుకోలేదు. వరుసగా స్వయంవరం – చిరునవ్వుతో – పెళ్లాం ఊరెళితే లాంటి హిట్ సినిమాలు చేశాడు. అయితే ఆ స్టార్ స్టేటస్‌ను వేణు ఎక్కువ కాలం నిలబెట్టుకోలేదు. తర్వాత వచ్చిన కుర్ర హీరోల పోటీని తట్టుకోలేక అవుట్ డేటెడ్ అయిపోయాడు.
సీనియర్ బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బి. గోపాల్ వేణుకు స్వయానా మేనమామ. బి. గోపాల్ సూపర్ ఫామ్‌లో ఉన్నప్పుడు వేణుతో ఒక సినిమా చేసి ఉంటే వేణు రేంజ్ వేరుగా ఉండేది. అయితే వీరిద్దరికి కథ సెట్ కాలేదు. ఆ తర్వాత వేణు నిలదొక్కుకోలేక చివరకు ఎన్టీఆర్ దమ్ము సినిమాలో బావగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా చేయాల్సి వచ్చింది.
ఇక లాంగ్ గ్యాప్ తర్వాత ఇప్పుడు వేణు రవితేజ రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఫ్యూచర్‌లో జగపతిబాబు, శ్రీకాంత్ లాంటి సీనియర్ హీరోల్లాగానే ఇలాంటి సపోర్టింగ్ రోల్స్ చేయాలని వేణు డిసైడ్ అయ్యాడు. ఇక వేణు బావ ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరరావు. ఇక ఇంజనీర్ కావాలని అనుకున్న వేణు సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చి హీరో అయ్యాడు.
2001లో అనుపమతో వేణు వివాహం జరిగింది. ప్రస్తుతం సినిమాల్లో ఛాన్సులు లేకపోవడంతో వేణు తన భార్యతో కలిసి వ్యాపారం చేస్తున్నాడట. ఇక రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో వేణు పాత్ర క్లిక్ అయితే.. అతడికి టాప్ హీరోలు, టాప్ దర్శకుల సినిమాల్లో మంచి సపోర్టింగ్ రోల్స్ వచ్చే ఛాన్సులు ఉన్నాయి.