తెలుగు సినిమా రంగంలో ఇప్పుడు వారసుల రాజ్యం, బంధుత్వాల హవాయే నడుస్తోంది. నందమూరి, అక్కినేని, కొణిదెల ఈ కాంపౌండ్ వాళ్లే రెండు, మూడు తరాలుగా హీరోలుగా కంటిన్యూ అవుతున్నారు. మెగా ఫ్యామిలీలోనే ఇప్పుడు ఏకంగా 11 మంది హీరోలు ఉన్నారు. నందమూరి, అక్కినేని ఫ్యామిలీ బంధుత్వాలు కూడా మనకు తెలుసు. అయితే కొందరు నటుల మధ్య ఉన్న బంధుత్వాలు మనకు తెలియవు.. వీటి గురించి తెలిస్తే మనం ఆశ్చర్యపోతాం.
1. ఐశ్వర్య రాజేష్ – శ్రీలక్ష్మి :
ఐశ్వర్య రాజేష్ నటనా పరంగా ఇప్పుడు స్టార్ హీరోలతోనే పోటీపడుతూ మంచి మార్కులు వేయించుకుంటోంది. కౌసల్యా క్రిష్ణమూర్తి, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఐశ్వర్య ఒకప్పటి నటుడు రాజేష్ కూతురు. ఈమె తెలుగు హాస్యనటి శ్రీలక్ష్మికి స్వయంగా మేనకోడలు
2. సుహాసిని – కమలహాసన్ :
నటి సుహాసినికి కమలహాసన్ స్వయానా బాబాయ్. సుహాసిని తండ్రి చారుహాసన్ కమల్ హాసన్‌కు పెద్దన్నయ్య. చారుహాసన్ కూడా నటుడిగా చేశారు. ఇక సుహాసిని, దర్శకుడు మణిరత్నం భార్యభర్తలు. ఇక సుహాసినికి శృతీహాసన్ కజిన్.
3. రేఖ – సావిత్రి :
రేఖకి సావిత్రి సవతి తల్లి అవుతారు. జెమిని గణేశన్ – సావిత్రిని పెళ్లి చేసుకున్నాడు. అయితే జెమినీ గణేశన్‌కు పుష్పవల్లి ద్వారా కలిగిన సంతానమే రేఖ.
4. జివి ప్రకాశ్ – ఎఆర్ రెహమాన్ :
జివి ప్రకాశ్ – ఎఆర్ రెహమాన్‌కి స్వయానా మేనల్లుడు. ఎఆర్ రెహమాన్ పెద్దక్క ఎఆర్ రెయ్హానా కొడుకే జీవి. ప్రకాశ్. జి.వెంకటేష్ – రెయ్హానా ఏకైక కొడుకు ఈ జీవీ ప్రకాశ్.
5. అరుణ్ విజయ్ – ప్రీతి- శ్రీదేవి
రుక్మిణి, క్షేమంగావెళ్లి లాభంగారండి సినిమాల్లో నటించిన ప్రీతి, ఈశ్వర్ సినిమాతో పరిచయం అయిన శ్రీదేవి, నటుడు అరుణ్ విజయ్ ముగ్గురు అన్నా చెల్లెల్లు అవుతారు. వీళ్లు సీనియర్ నటుడు విజయ్‌కుమార్ పిల్లలు. ఆయన మొదటి భార్య కొడుకే అరుణ్ విజయ్. మొదటి భార్య ముత్తుకున్న చనిపోయాక నటి మంజులను విజయ్ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. వాళ్లే రుక్మిణి, ప్రీతి, మరో కాంట్రవర్సీ నటి వనిత అక్కాచెల్లెల్లు. ఇక దర్శకుడు సింగం హరి భార్య ప్రీతి.
6. జయసుధ – విజయ నిర్మల :
జయసుధకి విజయనిర్మల అత్త అవుతారు. సూపర్‌స్టార్ కృష్ణ – విజయనిర్మల జంటగా వచ్చిన పండంటికాపురం సినిమా సూపర్ హిట్. ఆ సినిమా ద్వారానే జయసుధ బాలనటిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఆమె స్టార్ హీరోయిన్ అయ్యారు.
7. చంద్రమోహన్ – కె . విశ్వనాధ్ :
నటుడు చంద్రమోహన్ మరియు వెటరన్ డైరెక్టర్ కె. విశ్వనాధ్ ఇద్దరూ కజిన్ సోదరులు అవుతారు.
8. ప్రియమణి – విద్యాబాలన్ :
బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ విద్యాబాలన్, ప్రియమణి ఇద్దరూ కజిన్ సిస్టర్స్ అవుతారు. ఇక ప్రముఖ ప్లేబాక్ సింగర్ అయిన మాల్గుడి శుభకు ప్రియమణి మేనకోడులు అవుతారు.
9. ఆర్ బి చౌదరీ – జీవా :
నిర్మాత , సూపర్ గుడ్ ఫిలిమ్స్ అధినేత ఆర్. బి. చౌదరీ , నటుడు జీవా ఇద్దరూ తండ్రీ కొడుకులు. జీవా ఈ, రంగం లాంటి హిట్లతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఇక చౌదరి తెలుగులో ఎందరో స్టార్ హీరోలతో హిట్ సినిమాలు తీశారు.
10. సుధీర్ బాబు – మహేశ్ బాబు :
సుధీర్ బాబు – మహేశ్ బాబు బావాబావమరుదులు అవుతారు. మహేష్ సోదరి ప్రియదర్శినితో సుధీర్ పెళ్లయ్యింది. పెళ్లి తర్వాతే సుధీర్ సినిమాల్లోకి వచ్చాడు.
11. నగ్మా – జ్యోతిక – రోషిణి :
నగ్మా, జ్యోతిక, రోషిణి ముగ్గురు అక్కా చెల్లెల్లు. షమా ఖాజి (సీమా), మొరార్జిల కుమార్తె నగ్మా. మొరార్జీతో విడాకుల తర్వాత సీమా చందేర్‌ను పెళ్లాడారు. ఈ దంపతులకు జ్యోతిక, రోషిణి జన్మించారు. ఈ ముగ్గురు అక్కచెల్లెల్లు కూడా చిరంజీవితో నటించి అరుదైన రికార్డు నెలకొల్పారు.
12. విద్యుల్లేక రామన్ – సెల్వరాఘవన్ :
దర్శకుడు సెల్వరాఘవన్ హాస్యనటి విద్యుల్లేఖ రామన్ కి బావ అవుతారు. 7జి బృందావన్ కాలనిలో హీరోయిన్‌గా నటించిన సోనియా అగర్వాల్‌ను ప్రేమ వివాహం చేసుకున్న సెల్వ రాఘవన్ ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చి గీతా రామన్‌ను పెళ్లాడారు. గీతారామన్, విద్యుల్లేక రామన్ అక్కా చెల్లెల్లు. విద్యుల్లేక రామన్ తండ్రి మోహన్ రామన్ కూడా ప్రముఖ నటుడే.
13. రజినికాంత్ – అనిరుధ్ రవిచంద్ర
సూపర్ స్టార్ రజినికాంత్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్‌కు మామ అవుతారు. రజనీ భార్య లత, అనిరుధ్ తండ్రి రాఘవేంద్ర ఇద్దరు అన్నాచెల్లెల్లు అవుతారు.
14. టబు – షబానా ఆజ్మి :
టబు, షబానా అజ్మికి మేనకోడలు. టబు తండ్రి జమాల్ హష్మి షబానాకు అన్నయ్య అవుతారు.