Gossipsఅనుష్క వ‌రుస సినిమాలు చేయ‌క‌పోవ‌డం వెన‌క అస‌లు ర‌హ‌స్యం ఏంటో తెలుసా?

అనుష్క వ‌రుస సినిమాలు చేయ‌క‌పోవ‌డం వెన‌క అస‌లు ర‌హ‌స్యం ఏంటో తెలుసా?

అనుష్క శెట్టి గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో నాగార్జున హీరోగా వ‌చ్చిన `సూప‌ర్‌` సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయిన ఈ బెంగుళూరు భామ‌.. విక్రమార్కుడు సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా త‌ర్వాత అనుష్క వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. వ‌రుస సినిమాలు చేస్తూ స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుంది.

ఇక అనుష్క కెరీర్‌ను మ‌లుపు తిప్పిన చిత్రం `అరుంధతి`. కోడి రామకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా 2009లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచి భారీ క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టింది. ఈ సినిమాలో జేజ‌మ్మ పాత్ర‌లోకి ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసిన అనుష్క‌.. త‌న అద్భుత‌మైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను మంత్ర ముగ్దుల‌ను చేసింది. ఈ సినిమా త‌ర్వాత లేడి ఓరియెంటెడ్ మూవీస్‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారిన అనుష్క‌.. బాహుబ‌లితో దేశ‌వ్యాప్తంగా సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది.

కానీ, ఈ మూవీ త‌ర్వాత అనుష్క క్ర‌మంగా సినిమాలు చేయ‌డం త‌గ్గించేసింది. దాంతో అనుష్క వ‌రుస సినిమాలు చేయ‌క‌పోవ‌డం వెన‌క అస‌లు ర‌హ‌స్యం ఏంటా అని ఎప్ప‌టి నుంచో ఆమె అభిమానులు ఆరా తీస్తున్నారు. అయితే వినిపిస్తున్న తాజా స‌మాచారం ప్ర‌కారం.. గ‌తంలో మాదిరిగా గ్లామ‌ర్ షో చేయ‌డానికి అనుష్క ఇప్పుడు ఇష్ట‌ప‌డ‌టం లేదు. పైగా సైజ్ జీరో సినిమా కోసం బాగా బ‌రువు పెరిగింది. కానీ ఆ బ‌రువును త‌గ్గించుకోవ‌డంలో ఆమె ఫెయిల్ అయ్యింది. ఈ నేప‌థ్యంలోనే అనుష్క వ‌రుస సినిమాలు చేసేందుకు ఒప్పుకోవ‌డం లేదని.. దాంతో ఆమెకు క‌థ‌లు చెప్పే ద‌ర్శ‌క‌ల‌, నిర్మాత‌లు సైతం క్ర‌మ క్ర‌మంగా త‌గ్గిపోయార‌ని అంటున్నారు.

కాగా, లాంగ్ గ్యాప్ త‌ర్వాత అనుష్క ఈ మ‌ధ్యే ఓ సినిమాను ప్ర‌క‌టించింది. పి.మహేశ్‌బాబు దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై తన 48వ ప్రాజెక్ట్‌ చేయనున్నట్లు అనుష్క ప్రకటించింది. న‌వీన్ పొలిశెట్టి ఇందులో హీరోగా న‌టిస్తుండ‌గా.. ఫుల్‌ టైమ్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెర‌కెక్క‌బోతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news