Moviesఈ స్టార్ హీరో డబ్బులిచ్చి ఆమెని పెళ్లి చేసుకున్నాడనే విషయం మీకు...

ఈ స్టార్ హీరో డబ్బులిచ్చి ఆమెని పెళ్లి చేసుకున్నాడనే విషయం మీకు తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో డేటింగ్ లు ,ప్రేమ పెళ్లిళ్లు కామన్. ఓ సినిమా షూటింగ్ టైంలో లవ్ పడ్డం అంటూ ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరో హీరోయిన్ లు అలా ప్రేమలో పడి..పెళ్లి చేసుకుని..లైఫ్ లో సెటిల్ అయిన వారు ఉన్నారు. అలాగే తమ వైవాహిక జీవితాని మధ్యలోనే ఎండ్ చేసిన వారు ఉన్నారు. ప్రతి చిన్న విషయానికి గొడవలు పడి..ప్రాణంగా ప్రేమించి..ఇష్టంగా పెళ్లి చేసుకున్న జంటలు విడిపోతున్నారు. అలాంటి వారికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్, అప్పటి స్టార్ హీరోయిన్ షాలిని.

 

తమిళ సినీ పరిశ్రమకు చెందిన హీరోనే అయినా.. సుదీర్ఘ కాలంగా తన హవాను చూపిస్తూ దేశ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకున్నాడు తలా అజిత్ కుమార్. ఇక, జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు.తెలుగు వాడు అయిన అజిత్ తమిళనాడుకెళ్లి అక్కడ స్టార్‌గా ఎదగడం విశేషం. వరుస విజయాలతో, రికార్డ్ స్థాయి కలెక్షన్లతో ప్రపంచవ్యాప్తంగా తమిళ సినిమా, ఇండియన్ సినిమా సత్తా ఏంటనేది చూపించారు అజిత్. సినిమాల పరంగానే కాకుండా సమాజానికి ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మంచి పేరును సంపాదించుకున్నాడు.

జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా లో బేబీ శాలిని గా మనందరి హృదయాలను కట్టిపడేసిన బాలనటి శాలిని ఆ తర్వాత హీరోయిన్ గా కొంత కాలం సినీ ఇండస్ట్రీని ఏలిసింది. తమిళ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుని ఎంతో మంది అభిమానులను దక్కించుకున్న షాలిని.. అజిత్ తో కలిసి అమర్కలం చిత్రంలో కథానాయికగా చేస్తున్న టైంలోనే వీరిద్దరు లవ్ లో పడ్డారు. ఇక అదే విషయాని ఇంట్లో చెప్పగా..షాలినీ తల్లిదండ్రులు ఒప్పుకోలేదట

షాలిని అజిత్ వివాహానికి షాలిని తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పగా వారిని ఒప్పించేందుకు అజిత్ స్వయంగా రంగంలోకి దిగి ఒప్పించాడమే కాకుండా ఏకంగా కోటి రూపాయలు ఎదురు కట్నం మరియు పలు రకాల బహుమతులు కూడా ఇచ్చాడని ఆరోజుల్లోనే పెద్ద హాట్ టాక్. ఇక ఆ తరువాత 2000 లో వీరిద్దరి వివాహాం హిందూ, క్రిస్టియన్ మరియు ముస్లింలు సంప్రదయాల్లో అంగరంగ వైభవంగా స్టార్ సెలబ్రిటీలు సైతం ఆశ్చర్యపోయేలా జరిగింది. హీరో అజిత్ ను వివాహం చేసుకున్న తర్వాత ఆమె పూర్తిగా సినిమాలకు దూరం అయ్యారు. భర్త పాపతో ఫ్యామిలీ లైఫ్ ను గడుపుతున్న షాలిని రెగ్యులర్ గా సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంది. మళ్లీ ఇప్పుడిప్పుడే రీఎంట్రీకి ప్లాన్ చేస్తుంది షాలిని.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news