MoviesRRRలో రాజమౌళికి ఇష్టమైన పాత్ర ఇదేనట..ఎందుకంటే..?

RRRలో రాజమౌళికి ఇష్టమైన పాత్ర ఇదేనట..ఎందుకంటే..?

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ – మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్లో తెర‌కెక్కిన ఆర్ ఆర్ ఆర్. కొట్లాది మంది అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఈ సినిమా జనవరీ 7న రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచనాలు పెట్టుకుని ఉన్నారు. రామ్‌చ‌ర‌ణ్ అగ్గిపిడుగు అల్లూరిగా గ‌ర్జిస్తే.. ఎన్టీఆర్ గోండు బెబ్బులి అల్లూరి సీతారామ‌రాజుగా విజృంభించాడు.

పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సుమారు 450 కోట్ల భారీ బడ్జెట్ తో దానయ్య నిర్మిస్తున్నారు.బాహుబ‌లి – ది కంక్లూజ‌న్ త‌ర్వాత ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాపై దేశ‌వ్యాప్తంగా భారీ అంచ‌నాలు ఉన్నాయి. మూడేళ్ల నుంచి ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తోన్న ఈ సినిమాను సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న ప్ర‌పంచ వ్యాప్తంగా 14 భాష‌ల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే ఒమిక్రాన్ ఎఫెక్ట్‌తో మ‌రోసారి వాయిదా వేయ‌క త‌ప్ప‌లేదు. ఈ సినిమా మొత్తం ఇద్ద‌రు మ‌హా యోధుల పోరాటం ఎలా ఉంటుంది ? వీరు బ్రిటీష‌ర్ల‌ను ఎలా ఎదుర్కొన్నారు ? అన్న లైన్ మీదే ఈ క‌థ తెర‌కెక్కింది అంటూ వార్తలు వినిపించాయి.

కేవలం ప్రమోషన్స్ కోసమే 52 కోట్లు ఖర్చు చేసారు రాజమౌళి అని నెట్టింట వార్తలు మారు మ్రోగిపోతున్నాయి. అయితే ఈ సినిమాలో చరణ్-తారక్ పాత్రలు సమానంగా రూపొందించిన రాజమౌళికి ఎవరి పాత్ర ఎక్కువ ఇష్టం అని చాలా ఇంటర్వ్యుల్లో ఇలాంటి ప్రశ్న ఎదురైంది. అయితే ఇన్నాళ్లకు ఆ ప్రశ్నకు సమాధానం దొరికినట్లు తెలుస్తోంది.

ఇటీవల ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ బాలీవుడ్ మీడియాకి రాజమౌళి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ ..సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు పోషించిన పాత్రల్లో రామ్ చరణ్ చేసిన అల్లూరి సీతారామరాజు పాత్ర ఒకింత రాజమౌళికి ఎక్కువ ఇష్టమని చెప్పాడట. ఎందుకు చరణ్ పాత్ర ఇష్టం అని చెప్పానో తెలియాలంటే మీరు సినిమా చూస్తే అర్ధమౌతుంది అని చెప్పుకొచ్చరట. దాంతో ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియా లో వైరల్ గా మారుతున్నాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు ఏప్రిల్ 28న ఈ సినిమా విడుదల కానున్నట్లు తెలుస్తోంది…!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news