ఇటీవల కాలంలో సినిమా వాళ్లకు విడాకులు మామూలు అయిపోయాయి. చివరకు స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లు కూడా చాలా సింపుల్‌గా ప్రేమించుకుని.. పెళ్లి చేసుకుని.. అంతే సింపుల్‌గా విడిపోతున్నారు. కొద్ది నెలల క్రితం టాలీవుడ్ స్టార్ కఫుల్ అక్కినేని నాగచైతన్య – సమంత విడిపోవడం పెద్ద సంచలనం అయ్యింది. ఈ సంఘటన ఇంకా మదిలో ఉండగానే.. ఇప్పుడు సూపర్‌స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య , హీరో ధనుష్ విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటన చేసి అందరికి షాక్ ఇచ్చారు.
గత రాత్రి ధనుష్ – ఐశ్వర్య విడాకులపై ప్రకటన చేశారు. అసలు వీరిద్దరు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది ? అన్నదానిపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇటు రజనీకాంత్ ఫ్యామిలీతో పాటు అటు ధనుష్ ఫ్యామిలీలో ఇప్పటికే చాలా విడాకులు అయిపోయాయి. రజనీకాంత్ రెండో కుమార్తె సౌందర్య ముందుగా అశ్వినీ రామ్‌కుమార్‌ను 2010లో పెళ్లి చేసుకుంది. వీరికి ఓ బాబు పుట్టాక మనస్పర్థలు రావడంతో 2017లో విడిపోయారు. అనంతరం సౌందర్య ఓ బిజినెస్‌మేన్‌తో ప్రేమలో పడి 2019లో అతడిని పెళ్లి చేసుకుంది.
ఇక ఇప్పుడు రజనీ పెద్ద కుమార్తె ఐశ్వర్య సైతం ధనుష్‌తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. వీరికి 15 , 11 ఏళ్ల వయస్సు ఉన్న ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇక వీరికి పెళ్లి జరిగినప్పుడు ఐశ్వర్య వయస్సు 23 కాగా.. ధనుష్ వయస్సు 21. తన కంటే వయస్సులో రెండేళ్లు చిన్నవాడిని ఐశ్వర్య పెళ్లాడింది. వీరి జంట ఏంటని ? చాలా మంది కామెంట్ చేసినా వీరు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అయితే సడెన్‌గా విడాకుల ప్రకటన చేసి అందరికి షాక్ ఇచ్చారు.
ధనుష్ అన్న సెల్వ రాఘవన్ కూడా…
ఇక ధనుష్ అన్న సెల్వ రాఘవన్ ప్రముఖ దర్శకుడు. తెలుగులో వచ్చిన 7 / జీ బృందావన్ కాలనీ, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలకు దర్శకత్వం వహించారు. 7 / జీ హీరోయిన్ సోనియా అగర్వాల్‌ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. సోనియాను 2006లో పెళ్లి చేసుకుని 2010లో విడాకులు ఇచ్చేశాడు. ఇలా అటు ధనుష్, ఇటు రజనీ ఫ్యామిలీలో వరుసగా విడాకులతో దాంపత్య జీవితాలు పెటాకులు అవుతున్నాయి.