Moviesశృతిని కాస్త త‌గ్గించుకోమ‌న్న నిర్మాత‌... దిమ్మ‌తిరిగే ఆన్స‌ర్ ఇచ్చిందిగా...!

శృతిని కాస్త త‌గ్గించుకోమ‌న్న నిర్మాత‌… దిమ్మ‌తిరిగే ఆన్స‌ర్ ఇచ్చిందిగా…!

మాస్ మహారాజా రవితేజ క్రాక్ సినిమా సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో శృతీహాస‌న్ మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌చ్చింది. ఈ సినిమా త‌ర్వాత ఆమెకు వ‌రుస‌పెట్టి ఆఫర్లు వ‌స్తున్నాయి. ప్ర‌భాస్ పాన్ ఇండియా సినిమా స‌లార్ సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది. యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప‌క్క‌న ఆమె న‌టిస్తోన్న తొలి సినిమా ఇదే. ఇక మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో సీనియ‌ర్ హీరో బాల‌య్య ప‌క్క‌న కూడా ఆమె హీరోయిన్‌గా ఎంపికైంది. ఇప్పుడు సీనియ‌ర్ హీరోలు సైతం ఆమెను హీరోయిన్‌గా తీసుకోవాల‌ని స్వ‌యంగా రిక‌మెండేష‌న్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ప‌క్కన కూడా ఆమె ఓ సినిమాలో హీరోయిన్‌గా చేసే ఛాన్సులు ఉన్నాయి.

ఇక ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తోన్న స‌లార్ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే 50 శాతం పూర్త‌య్యింది. విహార‌యాత్ర‌కు వెళ్లిన ప్ర‌భాస్ తిరిగి వ‌చ్చేశాడు. త్వ‌ర‌లోనే స‌లార్ షెడ్యూల్స్ కంటిన్యూ కానున్నాయి. ఇదిలా ఉంటే క‌రోనా టైంలో ఓ నిర్మాత శృతిని కాస్త త‌గ్గించుకోమ‌ని వార్నింగ్ ఇచ్చార‌ట‌. క‌రోనా టైంలో స్టార్స్ అంద‌రూ కూడా రెమ్యున‌రేష‌న్ త‌గ్గించుకోమ‌ని ఒత్తిళ్లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే శృతిని కూడా ఓ నిర్మాత రెమ్యున‌రేష‌న్ కాస్త త‌గ్గించుకోమ‌ని అడిగాడ‌ట‌.

అయితే అప్పుడు శృతి స‌ద‌రు నిర్మాత‌కు దిమ్మ‌తిరిగే ఆన్స‌ర్ ఇచ్చింద‌ట‌. ముందు మీరు ఈ విష‌యాన్ని హీరోల‌కు చెప్పండి.. హీరోలు వాళ్ల రెమ్యున‌రేష‌న్ త‌గ్గించుకుంటే అప్పుడు తాను కూడా రెమ్యున‌రేష‌న్ త‌గ్గించుకునేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని చెప్పింద‌ట‌. హీరోలు, హీరోయిన్ల రెమ్యున‌రేష‌న్లో చాలా తేడా ఉంటోంది… స‌ద‌రు నిర్మాత అడిగిన‌ప్పుడు తాను రెమ్యున‌రేష‌న్ త‌గ్గించుకునేందుకు ఏ మాత్రం ఇష్ట‌ప‌డ‌లేద‌ని శృతి కుండ‌బ‌ద్ద‌లు కొట్టేసింది.

హీరో, హీరోయిన్ల రెమ్యున‌రేష‌న్ తేడా క‌ల‌లో కూడా ఊహించ‌లేనంత‌గా ఉంటోంది. అయితే స‌ద‌రు నిర్మాత పేరు మాత్రం శృతి చెప్ప‌లేదు. ఇక స‌లార్ సినిమా గురించి కూడా శృతి కొన్ని ఇంట్ర‌స్టింగ్ విష‌యాలు చెప్పింది. ఈ సినిమా కంప్లీట్ యాక్ష‌న్ డ్రామా అని.. క్రాక్ సినిమా స్టైల్లోనే ఈ క‌థ‌లో యాక్ష‌న్ ఉంద‌ని… ఈ క‌థ‌ను న‌డిపించే పాత్ర త‌న‌దే అని చెప్పింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news