ఒకప్పుడు సినిమాలు తీసేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్‌లు జరిగినా ఎవ్వరూ పట్టించుకునే వారు కాదు. 1980 – 90 దశకాల్లో ఎంతో మంది దర్శకులు.. విదేశీ భాషల సినిమాలను ప్రేరణగా తీసుకుని కాపీ కొట్టి ఇక్కడ ఎన్నో హిట్ సినిమాలు తీసేవారు. అంతెందుకు ఆ కథతో పాటు కొన్ని సీన్లు కూడా అచ్చుగుద్దినట్టు దింపేసినా కూడా ఎవ్వరికి తెలిసేది కాదు. అయితే ఇప్పుడు అంతా సోషల్ మీడియా యుగం అయిపోయింది. ఏ దర్శకుడు అయినా ఏ ఫ్రెంచ్ భాషలో సినిమా నుంచి అయినా చిన్న సీన్ కాపీ కొట్టినా వెంటనే దొరికేస్తున్నాడు.
నెటిజన్లు డేగ కళ్లతో పట్టేస్తున్నారు. మహామహా దర్శకులు తెరకెక్కించిన సినిమాల్లో కాపీ సీన్లను కూడా నెటిజన్లు పట్టేయడంతో పాటు ట్రోల్ చేశారు. ఇదంతా ఇలా ఉంటే తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమాలో దర్శకుడు చేసిన ఓ చిన్న మిస్టేక్‌ను ఇప్పుడు నెటిజన్లు పట్టేశారు. దానిని సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు.
ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేసి ప్రేక్షకులను మైమరిపింపజేశాడు. ఇక సినిమాలో ఓ ఫైట్ సీన్ సందర్భంగా ఓ నటుడు విలన్ పక్కన సపోర్టింగ్ రోల్లో కనిపించాడు. విలన్ పక్కన సపోర్టింగ్ రోల్ చేసిన సదరు నటుడే మళ్లీ పోలీస్‌గా కనిపించాడు. ఒకే సినిమాలో బోయపాటి అదే నటుడిని రెండు పాత్రల కోసం వాడేశాడు. ఇది కావాలని చేయకపోయినా.. చిన్న చిన్న సపోర్టింగ్ రోల్స్ విషయంలో ఇలా జరుగుతూ ఉంటాయి.
అయితే అది నెటిజన్లు పట్టేశారు. ఇప్పుడు ఆ రెండు పాత్రల ఫొటోను మిక్స్ చేసి మరీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అక్కడ పోలీస్.. ఇక్కడ దొంగ అయ్యాడంటూ బోయపాటిపై సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇక అఖండ హిట్ జోష్‌లో ఉన్న బోయపాటి ఇప్పుడు అఖండకు సీక్వెల్‌గా అఖండ 2 చేస్తున్నట్టు ప్రకటించారు.