తాజాగా సూపర్‌స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు మృతి చెందడం అందరిని బాధపెట్టింది. రమేష్‌బాబుది పెద్ద వయస్సు కూడా కాదు 56. ఇక ఒక్కసారిగా ప్లాస్‌బ్యాక్‌లోకి వెళితే ఎన్టీఆర్, కృష్ణ మధ్య వెండితెరపై చాలా రోజుల పాటు అంతర్గత యుద్ధం నడిచింది. ఎన్టీఆర్ ఏం చేస్తే దానికి పోటీగా కృష్ణ మరొకటి చేసేవారు. ఎన్టీఆర్ పౌరాణికం సినిమాలు చేస్తే.. కృష్ణ కూడా చేసేవారు. ఎన్టీఆర్ సింహబలుడు సినిమా చేస్తే పోటీగా కృష్ణ సింహగర్జన చేశారు.
ఎన్టీఆర్ దానవీర శూరకర్ణ చేస్తే పోటీగా కృష్ణ కురుక్షేత్రం చేశారు. రెండూ ఒకేసారి రిలీజ్. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే.. కృష్ణ కాంగ్రెస్‌లోకి వచ్చి ఏలూరు నుంచి ఎంపీగా గెలిచారు. ఇక ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా పొలిటికల్ పంచ్‌లు వేస్తూ సినిమాలు తీశారు. ఈ పరంపరలో ఎన్టీఆర్ నట వారసుడిగా బాలకృష్ణ హీరోగా వచ్చారు. అప్పుడు కృష్ణ తన నట వారసుడిగా రమేష్‌బాబును తెరమీదకు తెచ్చారు.
బాలయ్య ఇప్పటకీ అగ్ర హీరోగా ఉన్నారు. రమేష్‌బాబు తండ్రి నట వారసత్వం కంటిన్యూ చేయలేకపోయాడు. అయితే ఆ లోటు మహేష్‌బాబు భర్తీ చేస్తున్నాడు. అది వేరే విషయం. ఇక అప్పట్లో బాలయ్యకు, రమేష్‌బాబుకు మధ్య ఓ టైటిల్ విషయంలో పెద్ద వార్ నడిచింది. ఇద్దరూ సామ్రాట్ అనే టైటిల్‌తో సినిమా చేశారు. కృష్ణ తన కుమారుడికి సూపర్ హిట్ కావాలని భారీ ప్లాన్ చేశారు. బప్పీలహరి మ్యూజిక్.. బాలీవుడ్ నుంచి హీరోయిన్ సోనమ్‌కు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసి రప్పించారు. అప్పట్లో ఆమెకు క్రేజ్ ఉండేది.
ఇక మరోవైపు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో బాలయ్య – విజయశాంతి హీరోగా అదే సామ్రాట్ టైటిల్‌తో సినిమా. చివరకు ఈ టైటిల్ గొడవ పెద్దది అయ్యి కోర్టు వరకు వెళ్లింది. కోర్టులో రమేష్‌బాబుకు అనుకూలంగా తీర్పు వచ్చింది. చివరకు బాలయ్య తన టైటిల్‌ను సాహస సామ్రాట్‌గా మార్చారు. అది నాడు జరిగిన సంగతి.