Moviesజయప్రదని శ్రీకాంత్ అంత దారుణంగా మోసం చేసాడా..ఎవ్వరికి తెలియని షాకింగ్ నిజాలు..!

జయప్రదని శ్రీకాంత్ అంత దారుణంగా మోసం చేసాడా..ఎవ్వరికి తెలియని షాకింగ్ నిజాలు..!

జయప్రద ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు . అందానికే అసూయ పుట్టే అందం జయప్రద ఆమెది. అందం, అభినయం, నాట్యం అన్ని కలగలిపిన అందాల నటి జయప్రద. సాంప్రదాయ పాత్రలైనా.. గ్లామరస్ రోల్ అయినా.. అద్భుతంగా నటించడంలో జయప్రద సిద్ధహస్తురాలు. ఒకప్పుడు స్టార్ హీరోలు అందరితో జతకట్టిన ఆమె, ఆ తర్వాత రాజకీయాల్లోనూ తన సత్తా చాటుకున్నారు. తన అందంతో నటనతో కోట్లాది మంది అభిమానులనున్సొంతం చేసుకుని..ఓ రేంజ్ లో చిత్ర పరిశ్రమను ఏలేసిన నటి. బడా బడా స్టార్ హీరోళు కూడా అమ్మడు పక్కన నటించేందుకు ఇంట్రెస్ట్ చూయించారంటేనే అమ్మడు సత్తా ఏంటో మనం అర్ధం చేసుకోవచ్చు.

తన అందానికి క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అందరి మన్ననలు అందుకున్న నటి. రాజకీయాల నేపథ్యంలో సినిమాలకు చాలాకాలం దూరంగా ఉన్నారు జయప్రద.అయితే ఇప్పుడు ఆమె తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. సినీ కెరీర్ పరంగా మంచి స్దాయిని సంపాదించుకున్న జయప్రద అంటే చాలా మందికి ఇష్టం. ఆమె ఏ నిర్ణయం తీసుకున్న కరెక్ట్ గా..నిజాయితీగా తీసుకుంటాది అని అంటారు అందరు.

కానీ ఆమె జీవితంలో ఒక్కే ఒక్క తప్పు చేసింది. అది కూడా సరిదిద్దుకోలేని తప్పు. ఇక ఆ తప్పు వల్ల జయప్రద జీవితం సర్వ నాశనం అయిపోయింది అంటారు ఆమెను అభిమానించే జనాలు. ఈమె తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో సైతం తన అందచందాలతో బాగా ఆకట్టుకుంది. ఇక అదే సమయంలో నే సినీ ఇండస్ట్రీలో శ్రీకాంత్ నహతా అని ఒక ప్రొడ్యూసర్ తో ప్రేమలో పడ్డి.. ఎవ్వరికి తెలియకుండా శ్రీకాంత్-జయప్రద ప్రేమించి వివాహం చేసుకున్నట్లు సమాచారం. కానీ ఆయనకి అప్పటికే పెళ్ళై ఇద్దరు పిలలు ఉన్నారు ఈ సంగతి జయప్రదకు తెలియదు. దీంతో ఆమె అతనితో పెళ్లికి ముందే నాలుగు సంవత్సరాలుగా బాగా కలిసి తిరుగుతూ ఉండేది అని అప్పట్లో వార్తలు వినిపించాయి.

ఇక తీరా పెళ్ళైయాక ఆయనకు ముందే పెళ్ళి అయ్యిందని తెలిసి షాక్ అయ్యిందట. ఇక దీంతో అవన్నీ భరించలేక జయప్రద ఆత్మహత్య చేసుకోవాలని అప్పట్లో ప్రయత్నించినట్లు సమాచారం. అప్పటి నుండి ఆయనను దూరం పెడుతూ వచ్చిందట. అయితే ఈ మధ్యకాలంలో కొన్ని కారణాల చేత శ్రీకాంత్ మరణించడం జరిగింది. ఇక ఈ ప్రొడ్యూసర్ ఎవరో కాదు అప్పట్లో స్టార్ హీరోల సినిమాలకి ప్రొడ్యూసర్ గా ఉన్న సుందర్లాల్ కుమారుడి ఈ శ్రీకాంత్.ఏది ఏమైనా లైఫ్ కూల్ గా ముందుకు వెళ్తున్న సమయంలో జయప్రద ఇలాంటి చిన్న తప్పుడు నిర్ణయం తీసుకోవడం వల్లే ఈమె జీవితాని నాశనం చేసిందని చెప్పవచ్చు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news